ఫిల్మ్ డెస్క్- ప్రతి సోమవారం ఈటీవీలో వచ్చే ఆలీతో సరదాగా కార్యక్రమానికి ఎంతో క్రేజ్ ఉంది. ప్రముఖ నటుడు ఆలి, సినీ రంగానికి చెందిన ప్రముఖులను సరదాగా ఇంటర్వూ చేస్తుంటారు. ముఖ్యంగా తెరమరుగైన నటీనటులను, సాంకేతిక నిపుణులను ఈ షోకు రప్పిస్తున్నారు ఆలి. దీంతో చాలా మంది ఆలితో సరదాగా షోకి అభిమానులుగా మారారు. ఐతే ఈ కార్యక్రమానికి తమ అభిమాన నటీనటులను పిలవాలని ఫ్యాన్స్ ఆలికి విజ్ఞప్తి చేస్తుంటారు. ఒక్కో సందర్బంలో డిమాండ్ కూడా చేస్తుంటారు అభిమానులు.
ఇదిగో ఈ క్రమంలో అభిమానులు ఓ స్టెప్ ముందుకేసి ఆలీతో సరదాగా బెదిరింపులకు దిగుతున్నారు. తమ అభిమాన నటుడు వడ్డె నవీన్ ను ఆలీతో సరదాగా కార్యక్రమానికి పిలవాలంటూ ఫ్యాన్స్ చాలా కాలంగా అడుగుతున్నారు. పిలిచిన వాళ్లనే మళ్లీ మళ్లీ పిలిచి చిరాకు రప్పించకపోతే, కొత్త వాళ్లని, తెరమరుగైన అలనాటి స్టార్స్‌ని పిలవొచ్చు కదా అని ప్రతి వారం అలీతో సరదాగా ఎపిసోడ్ ప్రోమో కింద కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అలీ గారూ..వడ్డే నవీన్‌ని గెస్ట్‌గా తీసుకుని రండి.. ఆ ఎపిసోడ్‌కి రికార్డ్ స్థాయిలో మిలియన్ల వ్యూస్ తీసుకుని వచ్చే బాధ్యత మాదీ అంటూ ఆయన అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
అయితే అలీ మాత్రం ఎవరొస్తే వాళ్లే అన్నట్టుగా రొటీన్‌గానే అలీతో సరదాగా కార్యక్రమాన్ని నెట్టుకొస్తున్నారు. దీంతో చాలా రోజులుగా కామెంట్లలో మాత్రం వడ్డే నవీన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎప్పుడూ అలీకి చాలా సాఫ్ట్‌గా రిక్వెస్ట్ చేసే అభిమానులు, ఈ సారి మాత్రం కాస్త సీరియస్‌గానే తమ డిమాండ్‌ని వినిపించారు. ఓ దశలో హెచ్చరిస్తూ ఖబడ్దార్ అలీ, మర్యాదగా వడ్డే నవీన్‌ని పిలవండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మనం అడిగిన వాళ్లని కాకుండా వచ్చిన వాళ్లే మళ్లీ మళ్లీ ఎందుకండీ, ఎప్పుడూ వీడియోను అప్ లోడ్ చేయడమే కాదు, కింద కామెంట్లు చదవరా.. అంటూ వడ్డే నవీన్ అభిమానులు ఆసహనం వ్యక్తం చేస్తున్నారు. అన్నట్లు వడ్డే నవీన్ 1997లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ప్రముఖ నిర్మాత వడ్డే రమేష్ వారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన వడ్డే నవీన్.. పెళ్లి, కోరుకున్న ప్రియుడు, మనసిచ్చి చూడు, స్నేహితులు, నా హృదయంలో నిదురించే చెలీ, ప్రేమించే మనసు, బాగున్నారా వంటి సినిమాల్లో హీరోగా నటించారు.