విభిన్నమైన పాత్రలు, కథలు ఎంచుకుంటూ.. ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకపోయినప్పటికి.. సక్సెస్‌ఫుల్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఏ పాత్ర సెలక్ట్ చేసుకున్నా.. ప్రాణం పెట్టి చేస్తాడు. సినిమా ప్రారంభం నుంచి పూర్తయ్యేవరకు.. అన్ని తానే దగ్గరుండి చూసుకుంటాడు. సొంత డబ్బులు పెట్టి మరీ ప్రమోషన్ కార్యక్రమాలు కూడా చేస్తాడు. ఇక తాజాగా అడవి శేష్ నటించిన మేజర్ చిత్రం సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మూవీ సక్సెస్ మీట్‌లో అడవి శేష్ పలు ఆసక్తికర అంశాలు వెల్లడించాడు. ఆ వివరాలు..
తాను అమెరికాలోనే పుట్టి పెరిగానని అడివి శేష్ తెలిపాడు. అక్కడే కొన్నాళ్లు ఉద్యోగం చేశానని.. ఆ తరువాత సినిమాలపై ఆసక్తితో హైదరాబాద్‌కు తిరిగి వచ్చేశానని అన్నాడు. తాను చిన్న క్యారెక్టర్లు చేస్తున్న సమయంలో ఓ టాలీవుడ్ స్టార్ హీరో కొడుకు క్రేజ్ చూసి.. తనకు కూడా ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలని భావించానని తెలిపాడు. అలానే ఇప్పటివరకు తాను ఎన్నో డిఫరెంట్ రోల్స్ చేశానని.. తనకు ఓ ఫుల్‌టైమ్ లవ్ స్టోరీ చేయాలని ఉందని చెప్పాడు.ఘ
ఇది కూడా చదవండి: Anasuya: యాంకర్ అనసూయ హాట్ డ్యాన్స్! వీడియో వైరల్!
అలానే తన జీవితంలో కూడా లవ్ ఫెయిల్యూర్ ఉందని చెప్పుకొచ్చాడు. తాను అమెరికాలో ఉన్నప్పుడు ఓ పంజాబీ అమ్మాయిని ప్రేమించానని చెప్పాడు. అయితే కొన్ని కారణాల వల్ల బ్రేకప్ అయిందన్నాడు. తన పుట్టినరోజు నాడే ఆ అమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్లిపోయిందని గుర్తుచేసుకున్నాడు. ఆ తర్వాత వేరే వారితో రిలేషన్‌లో ఉన్నా.. పెళ్లి వరకు తీసుకెళ్లే ధైర్యం రాలేదన్నాడు. ప్రస్తుతం తన దృష్టి అంతా సినిమాలపైనే ఉందని చెప్పుకొచ్చాడు. మేజర్ హిట్ అందుకున్న అడివి శేష్.. త్వరలో గూఢచారి-2 మూవీ షూటింగ్‌లో పాల్గొనబోతున్నాడు. మరి దీనిపై మీ అభిప్రాయానలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Naga Chaitanya: మేజర్ హీరోయిన్‌తో ప్రేమలో అక్కినేని నాగచైతన్య?