సాధారణంగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే నటీ, నటులు అన్ని పాత్రలు చేయాల్సి ఉంటుంది. కొన్ని మూవీల్లో బోల్డ్ గా నటించాలి. మరికొన్ని చిత్రాల్లో చెల్లిగా, తల్లిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించాల్సి వస్తుంది. కాదు నేను ఇలాంటి పాత్రలే చేస్తానని కూర్చుంటే ఇక ఆ నటీ, నటుడి సినీ కెరీర్ ప్రమాదంలో పడినట్లే. ఇలాంటి హద్దులు చెరిపేస్తానంటోంది సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్. సీతారామం సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ గా మారిపోయింది ఈ సోయగం. దాంతో ఈ ముద్దుగుమ్మకు వరుసగా వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ అమ్మడు ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై అలాంటి పాత్రల్లో నటించడానికి సిద్దం అంటూ అనౌన్స్ చేసింది.
మృణాల్ ఠాకూర్.. దుల్కర్ సల్మాన్ హీరోగా హనురాఘవ పూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సీతారామం’. ఈ సినిమాలో మృణాల్ తన అందంతో పాటుగా అద్భుతమైన నటనతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. ఒక్క సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఈ సినిమాలోని తన నటనతో సౌత్ మేకర్స్ ను ఆకర్షించిన ఈ బ్యూటీ.. వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది. ఈ క్రమంలోనే ఓ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నట్లు మృణాల్ ఠాకూర్ తాజగా చెప్పుకొచ్చింది. సాధారణంగా టాప్ లో ఉన్న హీరోయిన్సే కాకుండా అవకాశాలు ఎక్కువ రాని హీరోయిన్స్ కూడా క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేయమంటే చేయరు.
అదీకాక యంగ్ హీరోయిన్లు హీరోలకు చెల్లిలి పాత్రలో నటించాలి అంటే అమ్మబాబోయ్ అంటారు. అయితే ఇలాంటి మూస పద్దతిని తాను పట్టించుకోను అంటోంది సీతారామం బ్యూటీ. ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్ మూవీ పిప్పాలో నటిస్తోంది. అయితే అందులో హీరోయిన్ పాత్ర కాదు. హీరో ఇషాన్ కట్టర్ సోదరిగా మృణాల్ కనిపించనుంది. యుద్ధం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పాత్ర నచ్చి తాను చెల్లిలి పాత్ర చేస్తున్నానని చెప్పుకొచ్చింది. దాంతో ఈ విషయం తెలిసిన అభిమానులు ఒక్క సారిగా షాక్ కు గురైయ్యారు. వెంటనే సోషల్ మీడియా వేదికగా ఆమెను ప్రశ్నించడం మెుదలుపెట్టారు. ఇషాన్ కు చెల్లిలిగా చేస్తున్నావ్ కాబట్టి.. భవిష్యత్ లో అతడిగా జోడీగా నటించవా? అంటూ కామెంట్స్ చేశారు.
దాంతో ఈ కామెంట్స్ పై కాస్త ఘాటుగానే స్పందించింది. హీరోయిన్లు.. హీరోయిన్లుగానే చెయ్యాలా? సోదరి, భార్య, తల్లి లాంటి క్యారెక్టర్స్ చేయకూడదా? అంటూ కౌంటర్ ఇచ్చింది. ఇలాంటి మూస పద్దతిని మనం బ్రేక్ చేసినప్పుడే మన సత్తా ఏంటో తెలుస్తుంది అని చెప్పుకొచ్చింది. ఇక కెరీర్ లో వెనక్కి తిరిగిచూసుకుంటే.. ఓ గొప్ప పాత్ర మిస్ చేసుకున్నాను అని బాధపడొద్దు అంటూ చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. ఇక పిప్పా సినిమాను బ్రిగేడియర్ మోహతా రాసిన ‘ది బర్నింగ్ చాఫీస్’ అనే పుస్తకం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు.