క్రికెట్ మ్యాచ్ అంటే పరుగులు, వికెట్లు మాత్రమే కాదు.. మైదానంలో గొడవలు కూడా కామన్ గానే ఉంటాయి. అయితే మ్యాచ్ తర్వాత షేక్ హ్యాండ్స్ సమయంలో మాత్రం అందరూ ఎంతో హుందాగా ప్రవర్తిస్తారు. కానీ, తాజాగా లక్నో- బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ లో మాత్రం నవీన్ ఉల్ హక్ అనే అఫ్గానీ ప్లేయర్ మాత్రం అలా ప్రవర్తించలేదు. విరాట్ కోహ్లీతో ఎంతో దురుసుగా ప్రవర్తించాడు.
ఐపీఎల్ 2023 సీజన్ లో 43వ మ్యాచ్ గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. ఆ మ్యాచ్ లో నవీన్ ఉల్ హక్- కోహ్లీ, గంభీర్- కోహ్లీ మధ్య జరిగిన సంఘటనలు చూసిన తర్వాత మ్యాచ్ గురించి అందరూ మర్చిపోయారు. అసలు ఆ మ్యాచ్ లో గెలిచింది ఎవరు? ఎంత తేడాతో గెలిచారు అనే విషయాలనే మర్చిపోయారు. ఈ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ పై ఆర్సీబీ 18 పరుగుల తేడాతో గెలిచింది. అయితే ఈ మ్యాచ్, గొడవలు సంగతి పక్కన పెడితే అసలు ఎవరు ఈ నవీన్ ఉల్ హక్? పోయి పోయి విరాట్ కోహ్లీతో పెట్టుకున్నాడు ఏంటి? అనే ప్రశ్నలు బాగా వినిపిస్తున్నాయి. అందుకే మీకోసం ఆ నవీన్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తీసుకొచ్చాం.
23 ఏళ్ల నవీన్ ఉల్ హక్ ఆఫ్గనిస్తాన్ లోని కాబూల్ లో జన్మించాడు. 17 ఏళ్ల వయసులో ఆఫ్గానిస్థాన్ జట్టు తరఫున సెప్టెంబర్ 25, 2016న తన అంతర్జాతీయ వన్డే కెరీర్ ని ప్రారంభించాడు. 2021 తర్వాత వన్డే జట్టుకు దూరమయ్యాడు. తన వన్డే కెరీర్ లో 7 మ్యాచ్ లు ఆడి.. 25.42 ఎకానమీతో 14 వికెట్లు పడగొట్టాడు. వన్డేల్లో 42 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీయడం అతని కెరీర్ బెస్ట్ స్పెల్. ఇంక సెప్టెంబర్ 21, 2019న నవీన్ ఉల్ హక్ తన అంతర్జాతీయ టీ20 కెరీర్ ని ప్రారంభించాడు. టీ20ల్లో నవీన్ ఉల్ హక్ మంచి గణాంకాలనే నమోదు చేశాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఇప్పటివరకు నవీన్ మొత్తం 21 మ్యాచ్ లు ఆడాడు. ఆఖరి టీ20 మార్చి 26, 2023లో పాకిస్థాన్ పై ఆడాడు. అంతర్జాతీయ టీ20ల్లో 19.46 సగటుతో 28 వికెట్లు పడగొట్టాడు. అతని టీ20 కెరీర్లో 3/21 బెస్ట్ స్పెల్ గా ఉంది.
నవీన్ ఉల్ హక్ కు టీ20 లీగుల్లో మంచి అనుభవమే ఉంది. సిడ్నీ సిక్సర్స్, క్వెట్టా గ్లాడిఏటర్స్, షార్జా వారియర్స్, గుయానా అమెజాన్ వారియర్స్, లెయిస్టర్ షైర్ వంటి జట్ల తరఫున టీ20 లీగ్స్ లో ఆడాడు. ఇంక ఈ ఐపీఎల్ సీజన్ లో నవీన్ ఉల్ హక్ లక్నో సూపర్ జెయింట్స్ తరఫున 4 మ్యాచ్ లు ఆడాడు. రాజస్థాన్ రాయల్స్(0/19), గుజరాత్ టైటాన్స్(1/19), పంజాబ్ కింగ్స్(3/30), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(3/30) జట్లపై ఆడాడు. దొరికిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్న నవీన్ ఉల్ హక్ పోయిపోయి కోహ్లీతో గొడవకు దిగి టాలెంట్ ఉంటే సరిపోదు.. కాస్త సీనియర్స్ అంటే గౌరవం కూడా ఉండాలి అని అందరితీ క్లాస్ పీకించుకుంటున్నాడు. ఈ మ్యాచ్ లో అతని ప్రవర్తనకు బీసీసీఐ మ్యాచ్ ఫీజులో సగం(రూ.1.79 లక్షలు) కోత పెట్టింది.
Then Shahid Afridi vs Naveen-ul-Haq in PSL.
Now Virat Kohli vs Naveen-ul-Haq in IPL.#ViratKohli #NaveenUlHaq #IPL2023 pic.twitter.com/cefhexMbVy— CricTracker (@Cricketracker) May 1, 2023
ఇంక నవీన్ గొడవ విషయానికి వస్తే.. రెండో ఇన్నింగ్స్ లో లక్నో సూపర్ జెయింట్స్ ఛేజ్ చేస్తున్న సమయంలో 17వ ఓవర్లో నవీన్ ఉల్ హక్- విరాట్ కోహ్లీ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఆ సందర్భంగా కోహ్లీ కోపంతో ఊగిపోయాడు. నవీన్ కు కోహ్లీ షూ కూడా చూపించాడు. అంపైర్లు, మిశ్రా మధ్యలో వచ్చి కోహ్లీని పక్కకు తీసుకెళ్లారు. అప్పుడు కోహ్లీ నాకు కాదు.. అతనికి చెప్పండి అంటూ చాలా సీరియస్ అయ్యాడు. అయితే నవీన్ ఉల్ హక్ కి ఇలా సీనియర్లతో గొడవ పడటం కొత్తేం కాదు. 2020లో PSLలో మ్యాచ్ తర్వాత అఫ్రిదీతో కూడా షేక్ హ్యాండ్స్ సమయంలో దురుసుగా ప్రవర్తించాడు. అఫ్రిదీ అతడిని చిరాకుగా నెట్టేశాడు. ఇప్పుడు ఆ వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతోంది. నవీన్ ఉల్ హక్ ప్రవర్తనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
All fights from LSG vs RCB#LSGvsRCB #Kohli #Gambhir #Mishra #naveen #ipl #mayers pic.twitter.com/09rgro5CN3
— SRK FAN (@King_Of_World_) May 1, 2023