ఐపీఎల్ లో జైస్వాల్ సంచలన బ్యాటింగ్ తో అదరగొడుతున్నాడు. ప్రస్తుత ఐపీఎల్ లో నిలకడగా పరుగులు చేస్తున్న జైస్వాల్.. నిన్న ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచులో భారీ సెంచరీతో విధ్వంసం సృష్టించాడు. ఈ ఇన్నింగ్స్ కి ముంబై కెప్టెన్ రోహిత్ సైతం ఫిదా అయ్యాడు. మ్యాచ్ అనంతరం జైస్వాల్ బ్యాటింగ్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.
ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. అతని బ్యాటింగ్ చూస్తే ఎవరికైనా ముచ్చటేస్తుంది. టైమింగ్, టెక్నీక్, దూకుడు కలగలిసిన జైస్వాల్ బ్యాటింగ్ ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటుంది. బౌలర్ ఎవరైనా ఎలాంటి బెదురు లేకుండా ఎదురు దాడి చేస్తూ నిలకడగా పరుగులు సాధిస్తున్నాడు. ఎంతో మంది స్టార్ బ్యాటర్లు ఉన్నా.. వారందరిని అధిగమించి ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. ఈ నేపథ్యంలో అందరినుండి ఈ యువ బ్యాటర్ ప్రశంసలు అందుకుంటున్నాడు. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా జైస్వాల్ ని పొగుడుతూ ఆకాశానికెత్తేసాడు. అంతే కాదు జైస్వాల్ టీమ్ ఇండియాలోకి ఎంట్రీ ఇస్తున్నాడనే హింట్ ఇచ్చేసాడు.
ఐపీఎల్ లో నిన్న ( ఆదివారం ) రాత్రి రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచులో గెలిచింది ముంబై అయినా అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం ఓపెనర్ జైస్వాల్. ఇతని బ్యాటింగ్ దాటికి ముంబై ఇండియన్స్ బౌలర్లు చూస్తూ ఉండిపోయారు. అందరిని ఆపినా ఈ ఒక్కడిని ఆపడానికి నానా తంటాలు పడ్డారు. భారీ సెంచరీ (124 )తో పలు రికార్డులు నెలకొల్పాడు. జైస్వాల్ ఇన్నింగ్స్ లో 16 ఫోర్లు, 8 సిక్సర్లు ఉండడం విశేషం. ఈ ఇన్నింగ్స్ కి ముంబై కెప్టెన్ రోహిత్ సైతం ఫిదా అయ్యాడు. మ్యాచ్ అనంతరం జైస్వాల్ బ్యాటింగ్ గురించి మాట్లాడాడు.
“నేను గత సంవత్సర కాలంగా జైస్వాల్ బ్యాటింగ్ ని గమనిస్తున్నాను. అతడి బ్యాటింగ్ నెక్స్ట్ లెవల్లో ఉంది. నీకు ఇంత పవర్ హిట్టింగ్ ఎక్కడనుంచి వస్తుందని అడిగాను. దానికి జైస్వాల్ నేను జిమ్ కి వెళ్తున్నాను అందుకే అవలీలగా సిక్సులు కొడుతున్నాను అని చెప్పాడు. అతడి బ్యాటింగ్ అద్భుతం. ఇది జైస్వాల్ కి వ్యక్తిగతంగానే కాక రాజస్థాన్ రాయల్స్ కి అదేవిధంగా టీమిండియాకు ఉపయోగపడుతుంది. అని చెప్పుకొచ్చాడు”. దీంతో జైస్వాల్ త్వరలో టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జైస్వాల్ కూడా ముంబై కావడం కలిసొచ్చేదే అనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. మరి రోహిత్ శర్మ చెప్పినట్లుగా త్వరలో భారత జట్టులో జైస్వాల్ కనబడతాడా ? ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.
Hundred comes up for Yashasvi Jaiswal his 1st of the IPL, many more to come. One of the most reliable openers rn, future of Indian Cricket. We are coming for that Orange Cap pic.twitter.com/IGyeQB321j
— Pratham. (@76thHundredWhxn) April 30, 2023