సన్‌రైజర్స్ పై ఓటమితో కాస్త డీలాపడిన పంజాబ్ టీమ్‌కు అదిరిపోయే న్యూస్. ఆ జట్టు కోసం ఒక స్టార్ హిట్టర్ వచ్చేస్తున్నాడు. ఆ స్టార్ బ్యాటర్ రాకతో టీమ్ బ్యాటింగ్ మరింత బలోపేతం కానుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదహారో సీజన్ ఆసక్తికరంగా సాగుతోంది. ఈ పది రోజుల్లో జరిగిన మ్యాచులు అభిమానులకు మస్తు వినోదాన్ని పంచాయి. జట్ల పెర్ఫామెన్స్ విషయానికొస్తే.. ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్ బాగానే ఆడుతోంది. తొలి రెండు మ్యాచుల్లో విజయాలతో ఆ టీమ్ పటిష్టంగా కనిపించింది. అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మూడో మ్యాచ్‌లో మాత్రం ఆ టీమ్ బ్యాటింగ్ డొల్లతనం బయటపడింది. ముఖ్యంగా రైజర్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్ బ్యాటింగ్ చాలా బలహీనంగా కనిపించింది. సారథి శిఖర్ ధావన్ తప్ప ఎవరూ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. ధవన్ మాత్రం తన సహజ శైలిలో అదరగొట్టాడు. ఈ నేపథ్యంలో ఆ జట్టుకో శుభవార్త.
పవర్ హిట్టర్, ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ లియామ్ లివింగ్‌స్టోన్ త్వరలో పంజాబ్ జట్టులో చేరనున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా లివింగ్స్టనే వెల్లడించాడు. ‘గత రెండు నెలలుగా కఠిన పరిస్థితులు ఎదురయ్యాయి. త్వరలోనే తిరిగి గ్రౌండ్లో అడుగుపెట్టబోతున్నా. త్వరలోనే మీతో జాయిన్ అవుతా పంజాబ్ కింగ్స్’ అని లివింగ్‌స్టోన్ సోమవారం ట్వీట్ చేశాడు. రూ.11.50 కోట్లు ఖర్చు చేసి పంజాబ్ కొనుగోలు చేసిన లివింగ్‌స్టోన్.. గాయం కారణంగా గతేడాది డిసెంబర్ నెల నుంచి క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ఇన్నాళ్లూ అతడు ట్రీట్మెంట్ తీసుకున్నాడు.
చికిత్స తర్వాత కొన్నాళ్లు విరామం తీసుకున్న లివింగ్‌స్టోన్ క్రమంగా కోలుకున్నాడు. తాజాగా ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘గతవారం కొన్ని ఇంజక్షన్లు తీసుకున్నా. అవి అద్భుతమైన ప్రభావం చూపించాయి. మరో 48 గంటల్లో భారత్‌కు పయనమవుతా’ అని లివింగ్‌స్టోన్ పేర్కొన్నాడు. దీనిపై ట్విట్టర్లో మరోమారు అప్డేట్ ఇచ్చాడు. దీంతో పంజాబ్ టీమ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఈ పవర్ హిట్టర్ వస్తే తమ బ్యాటింగ్ ఆర్డర్ మరింత బలపడుతుందని భావిస్తున్నారు. మరి.. ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపుతిప్పే సత్తా కలిగిన లివింగ్‌స్టోన్ రాక పంజాబ్ జట్టు విజయావకాశాలను పెంచుతుందని మీరు భావిస్తున్నారా? అయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Liam Livingstone’s inclusion will give a huge boost to Punjab Kings!
📸: IPL#LiamLivingstone #PunjabKings #IPL2023 pic.twitter.com/FXzPVi2Uar
— CricTracker (@Cricketracker) April 10, 2023