CSK vs MI Prediction: ఐపీఎల్ 2023లో చెన్నై సూపర్ కింగ్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడుతోంది. ఈ రెండు జట్లు ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్ ఫుల్ జట్టు. మరి వీటి మధ్య ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారంటే..?
ఐపీఎల్ 2023లో మ్యాచ్‌లు హోరాహోరీగా సాగుతున్నాయి. ఏ మ్యాచ్‌లో ఏ జట్టు గెలుస్తుందో చెప్పడం చాలా కష్టంగా మారింది. ఇప్పటి వరకు జరిగిన అన్ని మ్యాచ్‌లు క్రికెట్ అభిమానులకు మంచి వినోదాన్ని అందించాయి. అయితే శనివారం డబుల్ హెడ్డర్ ఉన్న విషయం తెలిసిందే. తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో రాజస్థాన్ రాయల్స్ తలపడుతుండగా.. రాత్రి జరిగే రెండో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ ఢీకొంటోంది. అయితే.. మరి ఈ మెగా ఫైట్‌లో ఎవరు విజేత నిలుస్తారనే దానిపై క్రికెట్ అభిమానులు ఆసక్తి కనబరస్తున్నారు. మరి వీరిలో ఎవరి బలం, బలహీనతలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
ముంబై ఇండియన్స్..
ఐపీఎల్ చరిత్రలో ఎవరికీ లేనన్ని కప్పులు ముంబైకి ఉన్నాయి. ఏకంగా ఐదు సార్లు ఆ జట్టు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచింది. ఆ సంఖ్యను ఆరుకు పెంచుకోవాలనే పట్టుదలతో ఈ సీజన్‌లో బరిలోకి దిగిన ముంబైకి.. ఆర్సీబీ తొలి మ్యాచ్‌లో గట్టి షాకిచ్చింది. దీంతో కనీసం రెండో మ్యాచ్‌లోనైనా గెలిచి.. గత సీజన్‌లో ఎదురైన వరుస ఓటముల రికార్డును వీలైనంత త్వరగా బ్రేక్ చేయాలని భావిస్తోంది. అయితే.. ముంబై ఓపెనర్లు రోహిత్ శర్మ– ఇషాన్ కిషన్ రాణించాల్సిన అవసరం వచ్చేసింది. వాళ్లిద్దరూ సరిగా ఆడకుంటే ఆ ప్రభావం మొత్తం జట్టుపై పడుతోంది. ఇక మిడిల్డార్‌లో సూర్యకుమార్ యాదవ్, కామెరున్ గ్రీన్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్‌తో బ్యాటింగ్ లైనప్ దుర్భేద్యంగా ఉంది. బౌలింగ్‌లోనే ముంబై చాలా వీక్‌గా కనిపిస్తున్నా.. జోఫ్రా ఆర్చర్, పీయుష్ చావ్లా మ్యాచ్‌ను మలుపు తిప్పగల సమర్థులు. ఇక మ్యాచ్ ముంబై హోం గ్రౌండ్ వాంఖడేలో జరుగుతుండటం వారికి కలిసొచ్చే అంశం.
చెన్నై సూపర్ కింగ్స్..
ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తర్వాత అత్యధిక ట్రోఫీలు ఉన్న టీమ్ చెన్నై సూపర్ కింగ్స్. ఆ జట్టు నాలుగు సార్లు ఛాంపియన్‌గా నిలిచింది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌లు ఆడిన సీఎస్‌కే గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో ఓడి.. లక్నోపై విజయం సాధించింది. చెన్నై ఓపెనింగ్ జోడీ బాగుంది. రుతురాజ్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. అలాగే మొయిన్ అలీ, బెన్ స్టోక్స్ ఫామ్‌లోకి వస్తే చెన్నై చాలా బలమైన టీమ్‌గా మారుతుంది. లక్నోపై అంబటి రాయుడు, ధోని మంచి టచ్‌లో కనిపించారు. చివర్లో వారిద్దరూ చాలా వేగంగా పరుగులు చేయగలరు. ఇది చెన్నై ప్రధాన బలం. ఇక బౌలింగ్‌లోనూ చెన్నై పటిష్టంగానే ఉంది. సాంట్నర్, దీపక్ చాహర్, జడేజా, మొయిన్ అలీ మ్యాచ్‌ను మలుపుతిప్పగల బౌలర్లు.
తుది జట్లు (అంచనా)
ముంబై: రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, గ్రీన్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, నెహాల్ వధేరా, హృతిక్ షోకిన్/కుమార్ కార్తీకేయ, పీయూష్ చావ్లా, ఆర్చర్, అర్షద్ ఖాన్.
చెన్నై: కాన్వె, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, బెన్ స్టోక్స్, అంబటి రాయుడు, జడేజా, ధోని, శివమ్ దూబే, సాంట్నర్, దీపక్ చాహర్, హంగర్గేకర్.
ప్రెడిక్షన్: ఇరు జట్ల బలాబలాలు పరిశీలించిన తర్వాత ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ గెలిచే అవకాశం ఉంది.