నేటికాలంలో మనిషిలో సహనం అనేది కొరవడింది. దీంతో చిన్న పెద్ద అనే వయస్సులతో సంబంధం లేకుండా అసహనానికి లోనవుతున్నారు. చిన్న చిన్న విషయాలకు సైతం ఒకరిపై మరొకరు కోపాలకు పోతున్నారు. ఇక దారుణం ఏమిటంటే.. కుటుంబ సభ్యుల మధ్య కూడా ఓర్పు లేకుండా పోతుంది. ఈ కారణంతో కొన్ని సందర్భాల్లో ఇంట్లోనే గొడవలు జరుగుతుంటాయి. అవి కాస్తా పెద్దవిగా మారి.. ఎవరో ఒకరి హత్యకు కారణంమవుతున్నాయి. తాజాగా మంచూరియా తినలేదని అమ్మమ్మని ఓ మనవడు దారుణంగా చంపేశాడు. ఆరేళ్ల క్రితం చోటు చేసుకున్న ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. నిందితులను పట్టుకోవడంతో విస్తుతపోయే నిజాలు తెలిశాయి. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని కెంగేరిలో శాంతకుమారి(69), ఆమె కుమార్తె శశికళ(46), మనవడు సంజయ్(26) తో కలిసి నివాసం ఉంటుంది. శాంత కుమారికి ఇంటిని, ఒంటిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకునేవారు. ఆమెకు కొంచెం అశుభ్రంగా అనిపించిన సహించేది కాదు. ఆమె మనవడు సంజయ్ ఏరోనాటికల్ ఇంజినీరింగ్ చదువుతున్నాడు. సంజయ్ చదవుల్లో బాగా రాణించేవాడు. అమ్మ, అమ్మమ్మతో కలసి వారి ఇంటి పనులో సాయం చేస్తూ ఉండే వాడు. అలా సాగిపోతున్న వారి కుటుంబంలో మంచూరియా చిచ్చుపెట్టింది. 2016 ఆగష్టులో తన అమ్మమ్మ కోసం సంజయ్.. గోబి మంచూరియా పార్సిల్ తీసుకువచ్చాడు. దాన్ని అమ్మమ్మ శాంతకుమారికి ఇవ్వబోయాడు. అయితే అది శుభ్రంగా లేదని భావించిన శాంతకుమారి.. ఆ గోబి మంచూరియా పార్సిల్ ను మనవడిపై విసిరికొట్టింది.
దీంతో ఆగ్రహం కట్టలు తెచ్చుకున్న సంజయ్ క్షణికావేశంలో అమ్మమ్మపై దాడికి పాల్పడ్డాడు. సంజయ్ కోపంతో పక్కనే ఉన్న రాగి సంగటి కలిపే కట్టెతో శాంతకుమారిని గట్టిగా కొట్టాడు. దీంతో ఆమె అక్కడిక్కడే మరణించింది. అయితే ఈ విషయాన్ని పోలీసులకు చెబుదామని సంజయ్ తల్లి శశికళ అంటుంది. తనను అరెస్టు చేసి జైలులో పెడాతరని ,అప్పుడు ఆమె ఒంటరవుతుందని హెచ్చరించాడు. దీంతో అతడి చేసిన తప్పును కప్పిపుచ్చేందుకు తల్లి కూడా సహకరించింది. డెడ్ బాడీ వాసన రాకుండా వివిధ రసాయానాలు, సుగంధ ద్రవ్యాలు పూశారు. శవాన్ని మాయం చేసేందుకు సంజయ్.. తన స్నేహితుడైన నందీశ్ ని సాయం కోరాడు. ఇక ముగ్గురు కలిసి గోడకు రంధ్రం చేసి.. మృతదేహాన్ని అందులో ఉంచి.. సిమెంట్ తో ప్లాస్టరింగ్ చేసి రంగులు వేశారు. హత్య చేసిన తరువాత కూడా మూడు నెలల పాటు అక్కడే ఉండి ఆ తర్వాత తాము ఊరికి వెళ్లి వస్తామని ఇంటి యజమానికి చెప్పి, తల్లీ కుమారుడు వెళ్లిపోయారు. వారు చాలా రోజులకి కూడా తిరిగి రాకపోడంతో ఇంటి యజమానికి అనుమానం వచ్చింది.
దీంతో 2017 మే 7న యజమాని తాళాలు పగల గొట్టి.. లోపలకి వెళ్లి చాడగా శాంతకుమారిని పూడ్చిపెట్టిన గోడకు, చీరపై రక్తం మరకలు కనిపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఇంట్లో సోదాలు నిర్వహించగా.. సజయ్ వదలి వెళ్లిన ఫోన్ ఆధారంగా నందీశ్ ను అరెస్ట్ చేశారు. అతడు వెల్లడించిన సమాచారంతో గోడను తవ్వి శవాన్ని బయటకు తీశారు. ఇక ఇంటి నుంచి పరారైన శశికళ, సంజయ్ మహారాష్ట్ర లోని కొల్హాపుర్ లో ఓ హోటల్ లో పనిచేస్తున్నారు. సంజయ్ సప్లయిర్ గా , శశికళ అంట్లు కడిగే పనులు చేసేది. చివరకి నిందితులిద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. మంచూరితో వచ్చిన చిన్నపాటి గొడవ మూడు జీవితాలను నాశనం చేసింది.