అది అర్థరాత్రి 2 గంటల సమయం. ఊళ్లో జనాలంత గాఢ నిద్రలోకి జారుకున్నారు. రోడ్లపై కుక్కలు తప్పా మనిషి జాడే లేదు. ఇదే మంచి సమయం అని భావించిన ఇద్దరు దుండగులు పక్కా ప్లాన్ తో ఊహించని కిరాతకానికి పాల్పడ్డారు. గాఢ నిద్రలో ఉన్న ఓ మహిళ ఇంట్లోకి వెళ్లి ఆ మహిళను తీవ్ర హింసకు గురి చేసి ఊహకు అందని దారుణానికి పాల్పడ్డారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగింది? ఆ దుండుగులు ఆ మహిళపై చేసిన దారుణం ఏంటనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అది కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ లోని రామక్రిష్ణాకాలనీ. ఇక్కడే గుజ్జుల సులోచన (45) అనే మహిళకు పెళ్లై ఓ కూతురు కూడా ఉంది. అయితే సులోచన భర్త గతంలోనే మరణించాడు. దీంతో అప్పటి నుంచి సులోచన కూతురితో పాటు నివాసం ఉంటుంది. అయితే కొన్నాళ్ల తర్వాత సులోచన కూతురికి సైతం పెళ్లి చేశారు. ఇదిలా ఉంటే దసరా పండగ కావడంతో సులోచన తన కూతురుని తీసుకుని అదే గ్రామంలో ఉన్న తన పుట్టింటికి వెళ్లింది. పండగ రోజు ముగ్గురు కలిసి ఎంతో సంతోషంగా గడిపారు. ఇక రాత్రి 11 దాటాక ముగ్గురు గాఢ నిద్రలోకి జారుకున్నారు.
కట్ చేస్తే అర్థరాత్రి 2 గంటల సమయం. ఇదే మంచి సమయం అని భావించిన ఓ ఇద్దరు వ్యక్తులు సులోచన పడుకున్న ఇంట్లోకి తలుపులు బద్దలు కొట్టి దూసుకొచ్చారు. ఇక రావడం రావడంతోనే.. కత్తులతో సులోచనపై కిరాతకంగా దాడి చేసి హత్య చేశారు. వీరి దాడిలో సులోచన అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. అడ్డొచ్చిన సులోచన కూతురు, ఆమె తల్లిని సైతం చంపుతామంటూ బెదిరించి అక్కడి నుంచి పరుగులు తీశారు. వీరి అరుపులు స్థానికులు పరుగు పరుగున వీరి ఇంట్లోకి వచ్చారు. వీరంత వచ్చి చూడగా సులోచన రక్తపు మడుగులో పడి ఉంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. అయితే సులోచనను దొంగలే హత్య చేశారా? లేక మరేదైన కారణం దాగి ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకంగా మారుతోంది.