సమాజంలో నలుగురికి మంచి చెప్పాల్సిన వాళ్లే.. నేడు నలుగురిలో నవ్వుల పాలు అవుతున్నారు. చట్టాన్ని కాపాడాల్సిన ఖాకీలే కటకటాల పాలవుతున్నారు. గౌరవమైన వృత్తిలో ఉన్నామన్న విషయాన్ని మరిచి సభ్య సమాజా సిగ్గుపడే రీతిలో కొందరు పోలీసులు వ్యవహరిస్తున్నారు. తాజాగా హనుమకొండ పట్టణంలో వెలుగు చూసిన సంఘటనతో.. మెుత్తం పోలీసు వ్యవస్థే తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఓ మహిళా CIతో రాసలీలలు సాగిస్తున్న మరో సీఐ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు ఆ మహిళా సీఐ భర్త. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే? ఆ మహిళా CI భర్త కూడా సీఐ కావడమే. మరి ఈ ముగ్గురి సీఐల వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
ఈ ఘటనకు సంబంధించి సుబేదారి CI షుకుర్ తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా రామ్ నగర్ ప్రాంతానికి చెందిన ఓ మహిళా సీఐ వరంగల్ CID కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తోంది. బలభద్ర రవి అనే మరో సీఐ అదే కార్యాలయంలో పని చేస్తున్నాడు. ఒకే కార్యాలయం కావడంతో వారిద్దరి మధ్య పరిచయం పెరిగింది. పరిచయం కాస్తా పెరిగి పెద్దదవడంతో.. ఇద్దరికి ఒకరింట్లోకి ఒకరికి రాకపోకలు సాగుతుండేవి. ఈ రాకపోకల విషయం మహిళా సీఐ భర్తకు తెలిసింది. ఇకడ గమనించాల్సిన విషయం ఏంటంటే? ఆ మహిళా సీఐ భర్త కూడా సీఐ కావడమే. అతడు మహబూబాబాద్ జిల్లాలో రూరల్ సీఐగా విధులు నిర్వర్తిస్తున్నాడు. వారిద్దరి విషయం తెలిసినప్పటి నుంచి వారిని పట్టుకోవాలని అతడు చూస్తున్నాడు.
ఈ నేపథ్యంలోనే సోమవారం సాయంత్రం వారిద్దరు తమ ఇంట్లోనే ఉన్నారన్న సమాచారం అందుకున్నాడు సీఐ భర్త. ఇదే అదునుగా భావించిన అతడు తన మిత్రులతో కలిసి.. ఇంట్లో బెడ్ రూంలో ఉన్న ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోవడంతో.. పోలీసులకు ఫోను చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు బలభద్ర రవిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే మహిళా సీఐ భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు సుబేదారి పోలీసులు తెలిపారు. ఈ కేసు విషయమై దర్యాప్తు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఇక ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. డిపార్డ్ మెంట్ విషయం కావడంతో విషయాలు బయటికి వెల్లడించడం లేదు. ఈ విషయం తెలిసిన స్థానికులు ఇదే పాడు బుద్ది.. నలుగురికి చెప్పాల్సిన వాళ్లే ఇలా బరితెగిస్తే.. ఇక సమాజం ఏం బాగుపడుతుంది. అంటూ విమర్శలు మండిపడుతున్నారు.