ఆమెకు డాక్టర్ అవ్వాలనే కోరిక చిన్నప్పటి నుంచి ఉంది. తన గమ్యాన్ని అందుకునేందుకు అనేక దారులు వెతికింది. చివరికి ఎంబీబీఎస్ కూడా పూర్తి చేసింది. డాక్టర్ అవ్వాలనే కల దగ్గరల్లోనే ఉందని అనుకుంటున్న తరుణంలోనే ఆమె ప్రాణాలతో లేకుండా పోయింది. తాజాగా ఏపీలో చోటు చేసుకున్న ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారుతోంది. అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అది శ్రీ సత్యసాయి జిల్లా హిందుపురం పట్టణం కొట్నూరు ప్రాంతం.
ఇక్కడే మల్లిఖార్జున్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతనికి సుప్రియ (30) అనే కూతురు ఉంది. ఆమెకు డాక్టర్ అవ్వాలనే కోరిక చిన్నప్పటి నుంచి ఉంది. అందుకు కోసం కర్నూలులోని ఓ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ కూడా పూర్తి చేసింది. ఇక వైద్య విద్యలో పీజీ చేయడానికి బెంగుళూరులోని శిక్షణ కూడా తీసుకుంటుంది. ఇక్కడ వరకు సంతోషంగా సాగిన ఆమె జీవితం ఒక్కసారిగ ఊహించని ములుపు తిరిగింది. అయితే గత కొన్ని రోజుల నుంచి సుప్రియ తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతోంది. కాగా దసరా పండగ సెలవులు కావడంతో సుప్రియ తన ఇంటికి చేరుకుంది.
ఇంటికి చేరుకున్నాక కూడా తల్లిదండ్రులతో సంతోషంగానే గడిపింది. కానీ పీజీలో సీటు వస్తుందో రాదేమోనని సుప్రియ మానసిక ఒత్తిడికి గురైంది. దీంతో ఒత్తిడి తట్టుకోలేని సుప్రియ తాజాగా ఇంట్లో తల్లిదండ్రులు టైమ్ చూసి బలవన్మరణానికి పాల్పడి ప్రాణాలు తీసుకుంది. ఇక సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా కూతురు చనిపోయి ఉంది. దీంతో సుప్రియ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. డాక్టర్ అవ్వాలని కలల కనిన సుప్రియ ఇప్పుడు ప్రాణాలతో లేకుండా పోవడంతో కుటుంబ సభ్యులు కంట కన్నీరు ఆగడం లేదు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్నిపరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.