రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే.. ఎప్పుడు ఏ మూల నుంచి ఏ దొంగ వెధవ వస్తాడో తెలియదు. ఆడవాళ్లకే కాదు, మగాళ్ల ప్రాపర్టీలకి కూడా రక్షణ లేదు ఈ సమాజం ఆఫ్ ఇండియాలో. రాత్రి డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తుంటే.. నైఫ్ చూపించి నైస్ గా జేబులో ఫోన్ ఎత్తుకెళ్లిపోతాడు. ఇవ్వకపోతే కొట్టేసి లాక్కెళ్లిపోతారు. కొంతమంది అయితే చైన్ స్నాచింగ్ లకి పాల్పడతారు. వీళ్ళకి రాత్రి, పగలూ తేడా ఉండదు. ఒకప్పుడు దొంగలు రాత్రుళ్ళు మాత్రమే డ్యూటీ చేసేవారు. ఇప్పుడు గిరాకీ ఉండడం లేదని పట్టపగలే దొంగతనాలకు పాల్పడుతున్నారు. రోడ్డు మీద ఏ యువతి మెడ కనబడినా.. మెడ మీద నక్కిలీసు గొలుసులే టార్గెట్ గా రెచ్చిపోతారు. చెవి రింగులు బంగారం అని తెలిస్తే లాక్కెళ్లిపోతారు.
మెడలో చైన్ లాగితేనే నొప్పిగా ఉంటుంది. అలాంటిది చెవి రింగులు లాగితే ఇంకేమైనా ఉంటుందా? ఒక బాలిక తన అమ్మమ్మతో కలిసి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుండగా.. ఇద్దరు దొంగలు బైక్ మీద వచ్చి బాలిక అమ్మమ్మ చెవి రింగులు అమాంతం లాగేశారు. వెంటనే ఆ బాలిక బైక్ పై పారిపోతున్న దొంగలని పట్టుకోసాగింది. ప్రాణాలకు తెగించి వాళ్ళతో పోరాడింది. బైక్ మీద పారిపోతుంటే వారి వెంటే పరిగెత్తుకుంటూ వెళ్లి మరీ పట్టుకుంది. అక్కడ దొంగ వెధవలతో గొడవ పడింది. మొత్తానికి ఆ దొంగల నుంచి ఒక చెవి రింగుని వెనక్కి తీసుకోగలిగింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో చోటు చేసుకుంది. ఈ మొత్తం వీడియో సీసీ టీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. విషయం తెలుసుకున్న పోలీసులు దొంగలని అదుపులోకి తీసుకున్నారు. బాలిక ధైర్యానికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అందరూ ఇలానే ధైర్యంగా ఎదిరించాలని అంటున్నారు.
In UP’s Meerut, a girl and her elderly grandmother made a brave attempt to stop miscreants on bike who were trying to flee after snatching earings. The suspects were later held in an encounter. pic.twitter.com/tpjAOSVaVp
— Piyush Rai (@Benarasiyaa) December 11, 2022
‘दो बदमाश बाइक पर आए और उनमें से एक बदमाश ने दादी के कानों के कुंडल छीन लिए. फिर मैं उसके पीछे भागी. हाथापाई हुई और मैंने एक कुंडल वापस ले लिया’
दो बाइक-सवारों से अकेले भिड़ जाने वाली बहादुर लड़की pic.twitter.com/WgpIr4NOd6— BBC News Hindi (@BBCHindi) December 11, 2022