ప్రతి ఒక్కరికీ సొంతింటి కల అనేది ఉంటుంది. చిన్నదో, పెద్దదో సొంత ఇల్లు ఉంటే ఒక ఇంద్రభవనంలో ఉన్నట్టే అనిపిస్తుంది. అద్దె ఇంట్లో ఉంటే ఎప్పుడు ఖాళీ చేయమంటారో తెలియదు. అంత సౌకర్యం ఉండదు, స్వేచ్ఛ ఉండదు. మనది అన్న భావన ఉండదు. అదే సొంత ఇల్లు అయితే ఇవేమీ ఉండవు. మరి సొంతింటి కల నెరవేర్చుకోవాలని మీకు ఉందా? అయితే ఈ ఆర్టికల్ మీ కోసమే.
పెద్ద పెద్ద మహా నగరాల్లో చాలా వరకూ వలస జీవితాలే ఎక్కువ. సొంత ఊరిలో అవకాశాలు లేక హైదరాబాద్ వచ్చి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు వెతుక్కుని జీవనం సాగిస్తుంటారు. ఇక హైదరాబాద్ లో ఉండాలంటే సొంతిల్లు ఏడ నుంచి వస్తుంది. అద్దె ఇంట్లోనే కదా ఉండాలి. అద్దింట్లో ఉంటే నీళ్లు ఎక్కువ వాడుతున్నారు, డ్రమ్ములు పెట్టుకోండి, ట్యాపుల్లో పట్టి నీళ్లు మోసుకోండి, గట్టిగా మాట్లాడుతున్నారు నోరు మూసుకోండి అని రకరకాల ఆంక్షలు పెడుతుంటారు. అందరూ ఇలా ఉండరు కానీ చాలా వరకూ అద్దెంట్లో ఉంటున్న వాళ్ళు యజమానులు పెట్టే ఆంక్షలకు ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారు.
అద్దె ఇంట్లో అవమానాలు, మనది కాదు అన్న భావన.. ఈ రెంట్ బతుకు అవసరమా అని అనిపిస్తుంది. అదే సొంత ఇల్లు అయితే మనమే బాసు, మనకి నచ్చినట్టు ఉండచ్చు. నీళ్ల సమస్య ఉండదు. పార్కింగ్ సమస్య ఉండదు. బిందాస్ లైఫ్ అని అనిపిస్తుంది. అద్దె చూస్తే వచ్చే జీతంలో సగం ఉంటుంది. జీతం ఇలా వచ్చిందంటే చాలు అందులో సగం డబ్బు రెంట్ కే పోతుంది. ఛీ ఇదేమి జీవితం.. ఆ రెంట్ కట్టే బదులు సొంత ఇల్లు కట్టుకుంటే ఉత్తమం అని అనిపిస్తుంది. కానీ హైదరాబాద్ లో సొంత ఇల్లు (ఫ్లాట్) అంటే 30, 40 లక్షలు ఉంటుంది. ఏదోలా మ్యానేజ్ చేసి లోన్ తీసుకుని ఫ్లాట్ కొనుక్కుంటే నెల నెల ఈఎంఐలు కట్టలేక చావాలి.
అప్పటి వరకూ రెంట్ 10 వేలు కట్టిన వాళ్ళు.. సొంత ఇల్లు కోసం 20, 30 వేలు పైనే కట్టాల్సి ఉంటుంది. జీతం మొత్తం ఈఎంఐ తినేస్తే ఏం తిని బతుకుతారు? మరి అద్దింట్లో ఉండలేక, సొంతింటి కల నెరవేర్చుకోక ఉండేదెలాగా? బతికేదెలాగా? అరె మేం మాత్రం మనుషులం కాదా? మాకు మాత్రం కల ఉండదా? అని అసహనానికి గురయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి వారికి గుడ్ న్యూస్. మీరు మరీ ఇబ్బందులు పడిపోకుండా చక్కగా జీవితాన్ని సాగిస్తూ కూడా సొంతింటి కలను నిజం చేసుకోవచ్చు. అదెలాగో ఈ కింది వీడియో చూసి తెలుసుకోగలరు. ఈ వీడియోలో సొంతింటి కలను ఎలా నిజం చేసుకోవాలో రమా రావి గారు చక్కగా వివరించుకొచ్చారు. మరి వీడియో చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.