ఒక దేశ ప్రధాని కుటుంబం అంటే ప్రజల్ల ఉండే గౌరవ మర్యాదలు, గుర్తింపు ఏ విధంగా ఉంటుందనేది తెలిసిందే. వారి ప్రతి చర్యలనూ ప్రజలు గమనిస్తుంటారు. వారిని ఫాలో అయ్యే వారి సంఖ్య కోట్లలో ఉంటుంది.
ఒక దేశ ప్రధాని అంటే వారిపై ప్రజలు చూపే ప్రేమాభిమానాలు, గౌరవ మర్యాదలు ఏస్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వాళ్లు చేసే ప్రతి పని గురించి అందరూ తెలుసుకోవాలని అనుకుంటారు. వారి కుటుంబాల గురించి కూడా తెలుసుకోవాలనే కుతూహలం జనాల్లో ఉంటుంది. ఇకపోతే, బ్రిటన్ ప్రధాని రిష్ సునాక్ గురించి తెలిసిందే. భారత సంతతికి చెందిన సునాక్ యూకే ప్రధాని అయ్యాడనే వార్త తెలియగానే మాతృదేశంలో కోట్లాది మంది సంతోషంలో మునిగిపోయారు. ఒకప్పుడు మన దేశాన్ని పాలించిన బ్రిటన్ను.. ఇప్పుడు భారతీయుడు నడిపించబోతున్నాడనే వార్త తెలిసి ఆనందంలో తేలియాడారు. ప్రధానిగా ప్రతి రంగంలోనూ తనదైన మార్క్‌ను చూపిస్తున్నారు సునాక్.
రిషి సునాక్‌కు ఎంత పాపులారిటీ ఉందో ఆయన భార్య అక్షతా మూర్తికి కూడా అంతే క్రేజ్ ఉంది. అక్షత తండ్రి భారతీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ నారాయణ మూర్తి కావడం వల్ల కూడా ఆమెకు మంచి క్రేజ్ వచ్చింది. తండ్రి వల్ల ఫేమ్ వచ్చినా అక్షత తన సొంత కష్టంతో పైకి ఎదిగారు. ఉన్నత చదువుల కోసం యూఎస్ వెళ్లిన ఆమె.. ఎడ్యుకేషన్ పూర్తయ్యాక కొన్నాళ్లు అక్కడే ఉద్యోగం చేశారు. ఆ తర్వాత సొంత కంపెనీ ఇన్ఫోసిస్‌లో మార్కెటింగ్ మేనేజర్‌గా బాధ్యతలు చేపట్టారు. 2014లో కాటమరాన్ అనే ఒక అంకుర సంస్థను ఆమె స్థాపించారు. వ్యాపారంతోనే కాదు సామాజిక సేవతోనూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు అక్షత. తన పేరు మీదే అక్షతా ఫౌండేషన్‌ను నెలకొల్పారు. విద్య, ఆరోగ్య రంగాలతో పాటు గ్రామాల అభివృద్ధి కోసం ఈ ఫౌండేషన్ ద్వారా తనదైన సాయాన్ని ఆమె అందిస్తున్నారు.
ఇకపోతే, అక్షతా మూర్తికి భారీ స్థాయిలో నష్టం వాటిల్లింది. ఆమె ఒక్కరోజులోనే రూ.500 కోట్ల వరకు నష్టపోయారు. ఇన్ఫోసిస్ సంస్థ షేర్ భారీగా పడిపోవడంతోనే ఆమెకు తీవ్ర నష్టాలు వచ్చాయి. సోమవారం సెషన్లో ఇండియన్ స్టాక్ మార్కెట్లలో ఐటీ రంగం కుదేలైంది. దిగ్గజ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ షేర్ ఒక దశంలో 11 శాతానికి పైగా నష్టపోయాయి. ఇన్ఫోసిస్ షేర్ల పతనంతో యూకే పీఎం రిషి సునాక్ భార్య అక్షతా మూర్తి 49 మిలియన్ యూరోలు లేదా 61 మిలియన్ డాలర్ల మేర నష్టపోయారని తెలుస్తోంది. ఇది ఇండియన్ కరెన్సీలో రూ.500 కోట్ల పైనే ఉంటుంది. కాగా, ఇన్ఫోసిస్ షేర్ల పతనంతో భారీగా నష్టపోయిన అక్షతా మూర్తికి.. ఇప్పటికీ ఆ సంస్థలో ఆమె వాటా విలువలో చూస్తే రూ.6 వేల కోట్లకు మీదే ఉంటుందని తెలుస్తోంది.
Rishi Sunak’s wife Akshata Murty lost about £49 million ($61 million) Monday after shares in Infosys Ltd tumbled the most since he became UK prime minister.https://t.co/1siGrOK3A4
— Economic Times (@EconomicTimes) April 18, 2023