బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. హౌస్ అంతా అసలైన ఆట ఆడుతున్నట్లు కనిపిస్తున్నారు. ఇంట్లోని సభ్యులు మొత్తం తమ బెస్ట్ ఇచ్చేందుకు చాలా కష్టపడ్డారు. కెప్టెన్సీ పోటీదారుల టాస్కులో విజయం సాధించి.. గీతూ, శ్రీసత్య, ఆదిరెడ్డి, ఫైమా, శ్రీహాన్ కెప్టెన్సీ కంటెండర్లు కూడా అయ్యారు. రెండు రౌండ్లుగా జరిగిన ఈ టాస్కులో ఆదిరెడ్డి విజయం సాధించి బిగ్ బాస్ హౌస్‌లో మూడోవారం కెప్టెన్ గా అవతరించాడు. రెండో వారం కెప్టెన్‌గా చేసిన రాజ్.. అంత గొప్ప మార్కులు సాధించలేకపోయాడు. ఆదిరెడ్డి అయినా హౌస్‌ని దారిలో పెడతారంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే హౌస్‌లో కొన్ని ఇంట్రస్టింగ్ విషయాలు నడుస్తున్నాయి.
అదేంటంటే.. నేను డబ్బుకోసమే గేమ్‌కి వచ్చాను, నాకు నేమ్, ఫేమ్ మాత్రమే కావాలి. ఇక్కడ నాకు ఎలాంటి రిలేషన్స్ లేవు, నా నుంచి ఆశించకండి అంటూ శ్రీ సత్య చెప్పడం చూశాం. అయితే ఆమె చాలా సందర్భాల్లో ఇంట్లో ఉన్న వాళ్లంతా నాకు అన్నయ్యలే అని చెప్పింది. తాజా ఎపిసోడ్‌లో కూడా ఈ అన్నయ్య అనే కాన్సెప్ట్ తెరమీదకు వచ్చింది. అడవిలో ఆట టాస్కు మధ్యలో శ్రీ సత్య- రేవంత్- అర్జున్ కల్యాణ్ బెంచ్ మీద కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అప్పుడు ఈ అన్నయ్యా అనే మాట వచ్చింది. “నేను రేవంత్‌ని కూడా అన్నయ్యా అనే పిలుస్తాను.. రేవంత్ అన్నయ్యా. నేను అందరినీ అన్నయ్యా అనే పిలుస్తాను. యాక్సెప్ట్ చేయడం, చేయకపోవడం మీ ఇష్టం. నేను శ్రీహాన్‌ని అన్నయ్యా అని పిలిచాను. అతను నన్ను చెల్లిగా యాక్సెప్ట్ చేశాడు” అంటూ చెప్పుకొచ్చింది.
శ్రీ సత్య అన్నయ్యా అనగానే రేవంత్ నేను యాక్సెప్ట్ చేయను అంటూ సమాధానం చెప్పాడు. అక్కడి నుంచి లేచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత అర్జున్ కల్యాణ్ ఈ అన్నయ్యా అనే టీజింగ్ కాస్త శ్రుతి మించుతోంది అంటూ శ్రీ సత్యతో చెప్పగా.. నేను ఏం చేసినా చాలా క్లియర్‌గా ఉంటాను. నన్ను ఎవరూ ఆడించలేరు, నేను ఎవరికీ ఆ అవకాశం ఇవ్వనూ అంటూ శ్రీ సత్య అర్జున్ కల్యాణ్‌కు కౌంటర్ ఇస్తుంది. ఇది కేవలం ఫన్ కోసమే అంటూ శ్రీ సత్య చెప్పగా.. దానిని పొడిగించకు నాకు నచ్చదు అంటూ అర్జున్ కల్యాణ్ చెప్పుకొచ్చాడు. మొత్తానికి శ్రీ సత్య రేవంత్‌కి చెల్లి కాలేకపోయింది. శ్రీ సత్య అందరినీ అన్నయ్యా అని పిలవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.