బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. ఈ షో రెండోవారం కూడా ముగింపు దశకు చేరుకుంది. కింగ్ నాగార్జున ఎవరిని ఎలిమినేట్ చేస్తారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే మొదటివారం ఎలిమినేషన్ లేనందు.. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. నామినేషన్స్ లో ఉన్న వారిలో అభినయశ్రీ, షానీ ఎలిమినేట్ అవుతారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఇవన్నీ పక్కన పెడితే హౌస్‌లో ఈసారి లవ్ ట్రాక్ లేదని మొన్నటి వరకు ప్రేక్షకులు చాలా ఫీలైపోయారు. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్‌లో లవ్ ట్రాక్ లకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అయితే హౌస్‌లో గత కొన్ని రోజుల నుంచి గమినిస్తున్న తీరుని బట్టి చూస్తే ఒక పెయిర్ ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఆ జంట మరెవరో కాదు.. ఇస్మార్ట్ అంజలి అలియాస్ ఆరోహీ రావ్, ఆర్జే సూర్య. అవును వాళ్లిద్దరి గురించే టాక్ బాగా వినిపిస్తోంది. హౌస్‌లో వాళ్లు బాగా క్లోజ్ గా ఉంటడం, ప్రతి విషయం షేర్ చేసుకోవడం, కొన్ని సందర్భాల్లో ఇద్దరూ కలిసే ఆడుతున్నారనే ఫీలింగ్ కూడా రాకపోదు. ఈ విషయాన్ని సమర్థించుకోవడానికి ఆరోహీ లైఫ్‌లో ఉన్న స్పెషల్ పర్సన్ సూర్యానే అంటూ కొందరు ఉదాహరణలు కూడా చెబుతున్నారు. అదేంటంటే.. ఆరోహీ రావు పుట్టినరోజు సందర్భంగా తన లైఫ్‌లో ముగ్గురు వ్యక్తులు ఉన్నారని ఇద్దరు మిత్రులు కాగా.. ఒకరు మాత్రం ఫ్రెండ్ కంటే ఎక్కువ, స్పెషల్ పర్సన్ అని చెప్పింది. కానీ, ఆ బర్త్ డే సెలబ్రేట్ చేసింది మాత్రం బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పింది. ఈ ఘటనను చెప్పి స్పెషల్ పర్సన్ హౌస్‌లో ఉన్నాడు కాబట్టే బయట బర్త్ డే ఫ్రెండ్చేశాడంటూ కామెంట్ చేస్తున్నారు.
అంతేకాకుండా రేవంత్‌తో గొడవ సమయంలో సూర్య– ఆరోహీని ఓదార్చిన తీరుని కూడా ఉదాహరణగా చెబుతున్నారు. వాళ్లిద్దరూ రిలేషన్లో ఉన్నారు, కానీ.. దానిని బయటపెట్టడం లేదంటున్నారు. తాజాగా అలాంటి వాదనను బలపరిచేందుకు ఇద్దరూ కూర్చుని మాట్లాడుకుంటూ కనిపించారు. ఆ సమయంలో ఆరోహీ చేతిలో ఉన్న పాల గ్లాసు తీసుకుని సూర్యా తాగుతూ ఉన్నాడు. అతని చేతిలో నుంచి గ్లాస్ లాక్కుని ఆరోహీ రావు మొత్తం తాగకు అంటూ గ్లాస్ లాక్కుని తను తాగుతంది. అంతేకాకుండా వారి మధ్య ఏదో ఉందనిపించేలా కూర్చుని మాట్లాడుకోవడం, చూసుకోవడం చేస్తుంటే ప్రేక్షకులు మాత్రం వారి మధ్య ట్రాక్ నడుస్తోందంటూ కామెంట్ చేస్తున్నారు.
అయితే ఈ వాదనను తోసిపుచ్చేవారు కూడా లేకపోలేదు. వాళ్లిద్దరూ మూడేళ్లుగా కలిసే పనిచేస్తున్నారు. వాళ్లు మంచి ఫ్రెండ్స్ కాబట్టే అంత క్లోజ్‌గా ఉంటున్నారు. ఆరోహికి ఎవరూ లేరు కాబట్టే సూర్య కాస్త కేరింగా ఉంటున్నాడు అంటూ చెబుతున్నారు. ఆరోహీ రావుకు ఎప్పుడూ సూర్య ఒక మంచి ఫ్రెండ్, మంచి మెంటర్, బెస్టీ మాత్రమే అని.. స్పెషల్ పర్సన్, లవ్ ట్రాక్ లా కాదంటూ వాదిస్తున్నారు. అయితే అతని మిత్రులు, ఆర్జే చైతులాంటి వాళ్లు ఆరోహీరావుని సూర్య కాస్త దూరం పెడితే బాగుంటుందని.. అతని గేమ్ మీద ఫోకస్ చేసి ముందుకెళ్లాలంటూ చెబుతున్నారు. అంతేకాకుండా అతను బయట ఉన్నట్లు హౌస్‌లో ఉండటంలేదని, కాస్త నిదానంగా ఉంటున్నాడని చెబుతున్నారు. ఆర్జే సూర్య- ఆరోహీరావుల మధ్య ఉన్నది జస్ట్ ఫ్రెండ్షిపేనా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.