మన దేశంలో సినిమా వాళ్లకు, రాజకీయ నాయకులకు ఉన్నంత క్రేజ్.. ఇతర దేశాల్లో సెలబ్రిటీలకు ఉండదు. మన దగ్గర నాయకులు, హీరోల కోసం ప్రాణాలు ఇచ్చేంత పిచ్చి అభిమానులుంటారు. ఇక తమ సంతానానికి అభిమాన హీరో, నేతల పేర్లు పెట్టుకునేవారు కోకొల్లలు. ఇలాంటి అభిమానుల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక తాజాగా ఇలాంటి వీరాభిమాని ఇంట జరిగిన ఓ వేడుకకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది. అన్నప్రాసన రోజు ఆ బుడ్డోడు అన్ని వదిలేసి.. పార్టీ జెండా పట్టుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది. ఇది చూసి వైఎస్సార్సీపీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాలు..
సాధారణంగా పుట్టిన పిల్లలకు ఆరు నెలల తర్వాత అన్నం అలవాటు చేస్తారు. ఈ సందర్భంగా అన్నప్రాసన కార్యక్రమం నిర్వహిస్తారు. దీనిలో భాగంగా దేవుడి దగ్గర పుస్తకాలు, పెన్ను, కత్తి, పూలు, డబ్బు, బంగారు ఆభరణాలు ఇలా రకరకాల వస్తువులు పెడతారు. వీటిలో శిశువు దేన్ని తీసుకుంటాడో దాన్ని బట్టి ఆ చిన్నారి భవిష్యత్తు ఉంటుందని భావిస్తారు. భారతీయ సంప్రదాయంలో ఎన్నో ఏళ్లుగా ఈ అన్నప్రాసన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఓ వైఎస్సార్సీపీ ఇంట అన్నప్రాసన వేడుక జరిగింది. ఈ క్రమంలో సదరు అభిమాని అన్నప్రాసన సందర్భంగా ఏకంగా పార్టీ కండువాను కూడా కార్యక్రమంలో ఉంచాడు.
ఈ సంఘటన ఎక్కడ జరిగింది అనే వివరాలు లేవు. ఓ ఇంట్లో చిన్నారి అన్న ప్రాసన కార్యక్రమంలో భాగంగా పుస్తకాలు, పెన్ను, కత్తి, పళ్లు డబ్బు, బంగారు నగలతో పాటుగా వైఎస్సార్సీపీ కండువాను కూడా ఉంచారు. ఇక ఆ బుడతడు పాక్కుంటూ వెళ్లి.. పుస్తకాలు, డబ్బులు, మిగిలిన వస్తువులు కాకుండా.. వైసీపీ కండువాను పట్టుకున్నాడు. ఈ సీన్ చూసిన కుటుంబ సభ్యులు మురిసిపోయారు. ఆ కండువాను బాలుడి మెడలో వేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక వైఎస్సార్సీపీపై ఉన్న అభిమానాన్ని ఇలా చాటుకున్నారంటూ చర్చించుకుంటున్నారు.