రోడ్డు మీద సైకో వీరంగం సృష్టించాడు. ఇటుక రాళ్లతో కనిపించిన కార్ల అద్దాలను ధ్వంసం చేశాడు. ఇంకా ధ్వంసం చేయబోతుండగా సైకోని పట్టుకుని తాళ్లతో కట్టేశారు.
సైకోలు వారి చేసే పని ఎందుకు చేస్తున్నారో కారణం ఉండదు. వాళ్లకి ఆ సమయంలో మైండ్ లో ఒక పురుగు కదులుతుంది. అంతే ఏదనిపిస్తే అది చేసేస్తారు. సైకోలు ఒక్కొక్కరూ ఒక్కో రకం. కొంతమందికి కొన్నిటినీ చూస్తే నచ్చదు. మరి కార్లని చూస్తే ఏమనిపించిందో ఏమో గానీ కారు కనిపిస్తే అద్దాలు పగలగొడుతున్నాడు. ఆగి ఉన్న కార్ల అద్దాలను ఇటుక బెడ్లతో ధ్వంసం చేస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్న సైకోను స్థానిక మున్సిపల్ సిబ్బంది, అధికారులు పట్టుకుని తాళ్లతో కట్టేశారు. ఈ ఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది. ఎక్కడి నుంచి వచ్చాడో ఒక రోడ్డు మీద సైకో వీరంగం సృష్టించాడు.
జిల్లా గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసి) సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రతి సోమవారం కాలుష్య నియంత్రణలో భాగంగా సొంత వాహనాలను కార్యాలయం వద్ద పార్కింగ్ చేసి నడుచుకుంటూ ప్రజల్లోకి వెళ్లి స్పందన పేరుతో కాలుష్య నియంత్రణ పట్ల అవగాహన కల్పిస్తుంటారు. ఈ క్రమంలో సోమవారం కూడా స్పందన కార్యక్రమం నిర్వహించారు. కారు పార్కింగ్ చేసి కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రజా ప్రతినిధులు, సిబ్బంది వెళ్లారు. అవతల రోడ్డు మీద ఉండగా సైకో కార్ల దగ్గర ఇటుకలతో వీరంగం సృష్టించాడు. ఆపేందుకు రోడ్డు దాటి ఇవతలకు వచ్చే లోపు ఇటుకలతో కార్ల అద్దాలను ధ్వంసం చేశాడు.
ఆ కార్లలో ఒకటి కార్పొరేటర్ కి చెందినదని సమాచారం. జీవీఎంసీ కార్యాలయం వద్ద పార్క్ చేసి ఉన్న కార్ల అద్దాలను ధ్వంసం చేశాడు. ఇటుకలతో కనబడిన కారు అద్దాలను పగులగొట్టుకుంటూ వెళ్ళాడు. దీంతో అప్రమత్తమైన జీవీఎంసీ భద్రతా సిబ్బంది, కారు డ్రైవర్ కలిసి సైకోని పట్టుకుని తాళ్లతో కట్టేశారు. రెండవ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాగిన మత్తులో అలా చేసి ఉండవచ్చునేమో అని చెబుతున్నారు. మరి ఒక యువకుడు సైకోలా మారి ఇంతలా ప్రజా ప్రతినిధుల, మున్సిపల్ సిబ్బంది కార్లను ధ్వంసం చేయడానికి కారణం ఏమై ఉండచ్చంటారు. నిజంగా అతనికి మతి స్థిమితం లేక ఇలా చేశాడా? లేక వేరే కారణం ఏమైనా ఉండి ఉండచ్చా? ఈ ఘటనపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.