ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం అయిన పులివెందుల అంటే ఎలా ఉండాలి. రాష్ట్రానికే ఆదర్శంగా ఉండాలి కదా. కానీ అలా ఉందా? ఉండకపోగా ఊరిలో ఒక బస్టాండ్ లేదు. ప్రయాణికులు కూర్చోడానికి కాదు కదా కనీసం నిలబడడానికి కూడా సౌకర్యం లేదు. తాటాకులతో ఏదో నామమాత్రంగా ఉంది అంటే ఉంది. గట్టిగా గాలి వీస్తే పడిపోయేలా ఉంది. ఇవి ఒకప్పుడు పులివెందుల బస్టాండ్ గురించి, జగన్ గురించి తక్కువ చేసి మాట్లాడిన మాటలు. కట్ చేస్తే తక్కువ చేసిన వాళ్ళే ఆశ్చర్యపోయేలా అత్యాధునిక సౌకర్యాలతో పులివెందుల బస్టాండ్ ని నిర్మించారు. కడప జిల్లా పులివెందులలో సకల హంగులతో బస్టాండ్ నిర్మితమైంది.
అత్యాధునిక సౌకర్యాలతో, సకల హంగులతో నిర్మించబడిన ఈ బస్టాండ్ ను సీఎం జగన్ ఈ నెల 25న ప్రారంభించనున్నారు. డిసెంబర్ 25 నుంచి ఈ బస్టాండ్ ను అమలులోకి తీసుకురానున్నారు. దాదాపు రూ. 34 కోట్ల వ్యయంతో ఈ బస్టాండ్ నిర్మితమైంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఈ బస్టాండ్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఆసియాలోనే అతి పెద్ద బస్టాండ్ గా పులివెందుల బస్టాండ్ ని తీర్చిదిద్దుతున్నామని ఆర్టీసీ చైర్మన్ మల్లిఖార్జున రెడ్డి అన్నారు. రూ. 34 కోట్ల వ్యయంతో బస్టాండ్ నిర్మాణం చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. పులివెందుల బస్టాండ్ లో జరుగుతున్న పనుల తీరును పరిశీలించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో బస్టాండ్ ని నిర్మించినట్లు ఆయన తెలిపారు.
కాగా ఈ బస్టాండ్ ని సీఎం జగన్ క్రిస్మస్ సందర్భంగా తన చేతుల మీదుగా ప్రారంభిస్తారని సమాచారం. ఇక అప్పుడు తాటాకులతో ఏదో నామ మాత్రంగా, నిలువ నీడ లేక ఇబ్బందులు పడ్డ ప్రయాణికులు.. ఇప్పుడు ఈ పులివెందుల బస్టాండ్ ని చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తలపించేలా పులివెందుల ఆర్టీసీ బస్టాండ్ ఉందని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తలపించేలా ఉన్న పులివెందుల బస్టాండ్ పై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేయండి.
★ Pulivendula New Bus Stand Works Completed 😍
CM Ys Jagan To Inaugurate This On December 24th#YSJagan #BuildAP pic.twitter.com/sRDSbmeFZp
— Vizag – The City Of Destiny (@Justice_4Vizag) December 22, 2022