సోషల్ మీడియా వినియోగం పెరిగాక.. ప్రతి విషయం నిమిషాల్లో ప్రపంచాన్ని చుట్టి వస్తుంది. మంచైతే ప్రశంసలు.. కుదిరితే అవార్డులు, రివార్డులు.. చెడు సంఘటన అయితే విమర్శలు. కానీ ఏ విషయం అయినా సరే.. ఇట్టే జనాలకు తెలిసిపోతుంది. ఇక సోషల్ మీడియా వినియోగం సామాన్యులను రాత్రికి రాత్రే సెలబ్రిటీలను చేస్తే.. ప్రముఖులకు వారి అభిమానులను మరింత దగ్గర చేసింది. ప్రస్తుతం ఇండస్ట్రీకి చెందిన చాలా మంది సినిమాల్లో కన్నా.. సోషల్ మీడియాలోనే ఎక్కువగా గడుపుతున్నారు. ఆ సంగతి పక్కన పెడితే.. తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ మనవడు హిమాన్షు చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఆ వివరాలు.. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా కూడా సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్‌గా ఉంటారో అందరికి తెలిసిన విషయమే. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్లో తీక్షణంగా చూస్తున్న పులి బొమ్మను పోస్ట్ చేసి.. మీ ఇంట్లో ఇలాంటి వ్యక్తి ఎవరంటూ ప్రశ్నించారు. ఈ పులి బొమ్మ మీద నేను దేనికి స్పందించను.. కానీ నమ్ము.. ప్రతిదాన్ని గమనిస్తూంటాను అనే క్యాప్షన్ ఉంది. ఇక ఈ ట్వీట్‌పై నెటిజనులు భారీ ఎత్తున స్పందించారు. వీరిలో తెలంగాణ సీఎం కేసీఆర్ మనవడు హిమాన్షు కూడా ఉన్నాడు. ఇక హిమాన్షు ఈ ట్వీట్‌కు స్పందిస్తూ.. మా కుటుంబంలో ఈ పులిలా ఉండే వ్యక్తి తాత కేసీఆర్ అంటూ రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం హిమాన్షు చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన టీఆర్ఎస్ కార్యకర్తలు కేసీఆర్ అంటే పులే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. My grandfather https://t.co/XVgaCCUv3u — Himanshu Rao Kalvakuntla (@TheRealHimanshu) August 11, 2022 ఇది కూడా చదవండి: నడిరోడ్డుపై పిల్లాడి పల్టీలు! గోల్డ్ విన్నర్ అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్.. ఇది కూడా చదవండి: కారు కొని బ్లెసింగ్స్ అడిగిన కస్టమర్.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన ఆనంద్ మహీంద్ర!