ఆనంద్ మహీంద్ర.. ఈ పేరు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. అనేక రకాల వీడియోలను సోషల్ మీడియా ద్వారా నెటిజన్లకు షేర్ చేసే పారిశ్రామిక వేత్తల్లో ఆనంద్ మహీంద్ర ముందుంటారు. ఆయన తరచూ ప్రేరణాత్మక వీడియోలను షేర్ చేస్తుంటారు. మహీంద్ర షేర్ చేసే వీడియోలు కొన్ని ఆశ్చర్యం కలిగించేవిగా ఉంటాయి. మరికొన్ని నవ్వులు తెప్పిస్తాయి.. ఆనంద్ మహీంద్ర తమ వినియోదారుల ట్వీట్లకు స్పందించి నెటిజన్ల మనసు దోచుకుంటారు. తాజాగా మరోసారి తమ కస్టమర్ చేసిన ట్వీట్ కు అదిరిపోయే రిప్లే ఇచ్చి అందరి మనసు దోచుకున్నారు ఆనంద్ మహీంద్ర. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆనంద్ మహీంద్రపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇంతకు అసలు విషయం ఏంటంటే.. అశోక్ కుమార్ అనే ఓ సోషల్ మీడియా ఫాలోవర్.. తాజాగా మహీంద్రా XUV700 మోడల్ కారుని కొనుగోలు చేశారు. అయితే తన ఆనందాన్ని మహీంద్ర కంపెనీ యాజమాని ఆనంద్ మహీంద్రతో పంచుకోవాలనుకున్నాడు. దీంతో మహీంద్ర ఎస్‌యూవీతో ఫోటోను ట్వీట్ చేస్తూ.."10 సంవత్సరాలు కష్టపడి కొత్త కారును కొనుగోలు చేశా.. మీ ఆశీర్వాదం కావాలి, సార్" అంటూ ఆనంద్ మహీంద్రకు ట్యాగ్ చేశారు. అయితే అశోక్ కుమార్ ట్వీట్ కి ఆనంద్ మహీంద్ర స్పందించారు. "ధన్యవాదాలు, కానీ వాస్తవానికి మా కంపెనీ కారు ఎంచుకుని మమ్మల్ని మీరే ఆశీర్వదించారు. మీరు కష్టపడి సాధించిన మీ విజయానికి అభినందనలు. హ్యాపీ మోటరింగ్" అంటూ ట్వీట్ చేశారు. అశోక్‌కుమార్.. ఆనంద మహీంద్రకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అంతేకాదు చాలామంది నెటిజన్లు కూడా దీనిపై స్పందిస్తూ ట్వీట్ చేశారు. ఆనంద్ మహీంద్ర వ్యాఖ్యను కూడా ప్రశంసించారు. "మీ ట్వీట్ చదివిన తర్వాత నా కళ్లలో నీళ్లు తిరిగాయి" అని ఒక యూజర్ కామెంట్ చేశారు. మరి.. ఆనంద్ మహీంద్ర ట్వీట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. Thank you, but it is YOU who have blessed us with your choice…Congratulatioms on your success that has come from hard work. Happy motoring. https://t.co/aZyuqOFIa8 — anand mahindra (@anandmahindra) August 2, 2022 Thank you, but it is YOU who have blessed us with your choice…Congratulatioms on your success that has come from hard work. Happy motoring. https://t.co/aZyuqOFIa8 — anand mahindra (@anandmahindra) August 2, 2022 ఇదీ చదవండి: ఒకప్పుడు స్వీపర్.. ఇప్పుడూ బ్యాంక్ లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్! ఇదీ చదవండి: ఒకే వేదికపై సీఎం జగన్, చంద్రబాబు..!