టీమిండియాలో ప్రస్తుతం ఉన్న ఆటగాళ్లలో ది బెస్ట్ టెస్టు బ్యాటర్ ఎవరని అడిగితే అందరూ చెప్పే పేరు చతేశ్వర్ పుజారా. అతని బ్యాటింగ్ స్టైల్ టెస్టు క్రికెట్‌కు అంతలా సూట్ అవుతుంది. పుజారా టీమిండియాలోకి వచ్చిన కొత్తలో అతని బ్యాటింగ్‌ను చూసి టీమిండియాకు మరో రాహుల్ ద్రవిడ్ దొరికేశాడని, నయా వాల్ అంటూ పుజారాను కొనియాడారు. అందుకు తగ్గేట్లే పుజారా కూడా ఇండియన్ టెస్టు టీమ్‌లో కీ ప్లేయర్‌గా ఎదుగుతూ వచ్చాడు. కానీ.. ఒక్కసారిగా పుజారాలో భారీ మార్పు వచ్చింది. రెండు మూడు నెలలుగా పుజారా ఆడుతున్న తీరు చూస్తుంటే అతన్ని టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ అనేందుకు ధైర్యం సరిపోవడం లేదు. నిఖార్సయిన టీ20 బ్యాటర్లా బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. సెంచరీల మీద సెంచరీలతో సరికొత్త పుజారాను ప్రపంచానికి పరిచయం చేస్తున్నాడు. ఫోర్లు, సిక్సులను మంచినీళ్లు తాగినంత ఈజీగా కొట్టేస్తున్నాడు. ముఖ్యంగా బ్యాటింగ్ స్టైల్.. పుజారా ఇలా ఆడతాడని కలలో కూడా ఎవరూ ఊహించని విధంగా ఉంది. స్వీప్‌షాట్లు, ఎక్రాస్ది లైన్ షాట్లు, ఫ్రంట్‌ఫుట్‌కు వచ్చి బౌలర్ నెత్తిపైనుంచి సిక్సులు అబ్బో... దాదాపు ఏబీ డివిలియర్స్‌ను దించేస్తున్నాడు. సంప్రదాయ క్రికెట్‌కు, క్లాస్ షాట్లకు కేరాఫ్ అడ్రస్‌గా ఉంటే పుజారా.. విధ్వంసపు క్రికెట్ ఆడుతున్నాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ద్రవిడ్ లాంటోడు సెహ్వాగ్‌లా మారిపోయాడు. బంతి వస్తే ఎలా డిఫెన్స్ ఆడాలని చూస్తే స్థాయి నుంచి బంతి పూర్తిగా రాకముందే ముందుకెళ్లి మరీ దాని సిక్స్ కొడుతున్నాడు. ఇలాంటి మార్పు పుజారాలో ఎలా వచ్చింది? ఎందుకొచ్చింది? పుజారా ఇంత కసిగా ఎందుకు ఆడుతున్నాడనే అనుమానం అందరిలోనూ కలుగుతోంది. ద్రవిడ్ వారసుడిగా వచ్చిన పుజారా సెహ్వాగ్‌కు సోదరుడిలా ఎందుకు మారుతున్నాడో.. ఇప్పుడు తెలుసుకుందాం.. టీమిండియా టెస్టు జట్టుకు మాత్రమే పరిమితమైన పుజారాకు దక్కాల్సిన గుర్తింపు దక్కలేదు. అందుకు కారణం.. ప్రస్తుతం అసలు సిసలైన క్రికెట్‌కు ఉన్న ఆదరణ కంటే ఇన్స్టెంట్ క్రికెట్‌కు ఉన్న డిమాండే ఎక్కువ. ఎవరు అవునన్నా.. కాదన్నా ఇది ఒప్పుకొని తీరాల్సిన సత్యం. ఈ నేపథ్యంలో ఎంతో మంది యువ క్రికెటర్ల కన్న వంద రెట్లు టాలెంటెడ్ అయిన పుజారాకు కొన్ని సందర్భాల్లో తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఐపీఎల్ లాంటి వేదికలపై పుజారా లాంటి వారికి స్థానం దక్కడం లేదు. బీసీసీఐ కాంట్రాక్ట్స్లోనూ పుజారా కంటే చాలా మంది యువ క్రికెటర్లు మెరుగైన స్థితిలో ఉన్నారు. ఇలా గుర్తింపు పరంగా, ఆర్థికంగా ఎంతో నష్టపోతున్న పుజారా.. తనకు జరుగుతున్న నష్టమేంటో గుర్తించినట్లు ఉన్నాడు. అందుకే బంతిని ఎలా ఎదురుకోవాలో తెలిసిన తనకు బంతిని బలంగా ఎలా బాదాలో తెలియదా అని తనకు తాను ఆత్మ పరిశీలన చేసుకున్నట్లు తెలుస్తుంది. అందుకే ఇకపై తన పంథా మార్చుకుని.. పరిమిత ఓవర్ల క్రికెట్లో తన సత్తా చాటాలని పుజారా బలంగా ఫిక్స్ అయినట్లు సమాచారం. అందుకు ఇంగ్లండ్‌లో జరిగే కౌంటీ క్రికెట్‌ను వేదికగా చేసుకున్నాడు. కౌంటీల్లో సత్తా చాటి.. రాయల్ లండన్ వన్డే కప్‌లో ససెక్స్ టీమ్‌కు కెప్టెన్ అయ్యాడు. వచ్చిన అవకాశాన్ని రెండు చేతులతో అందిపుచ్చుకున్న పుజారా.. కసితీరా ఆడుతున్నాడు. తన స్ట్రైక్‌రేట్‌ను అమాంతం పెంచేసుకున్నాడు. రెండు సెంచరీలను కేవలం 79, 75 బంతుల్లోనే బాదేసి ఔరా అనిపించాడు. అలాగే 28 బంతుల్లోనే 74 పరుగులు బాదాడు. ఒకే ఓవర్లో 22 పరుగులు పిండుకున్నాడు. ఇలా తనను తాను ఒక టీ20 స్పెషలిస్ట్ బ్యాటర్‌గా మార్చుకుంటున్నాడు. ఐపీఎల్, టీమిండియా వన్డే జట్టులో సుస్థిర స్థానం కోసమే పుజారా.. ద్రవిడ్ స్టైల్ నుంచి సెహ్వాగ్ స్టైల్‌కు మారినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం పుజారా ఫామ్, స్పీడ్ చూస్తుంటే ఐపీఎల్ 2023లో అతని కోసం ఐపీఎల్ టీమ్స్ పోటీ పడేలా ఉన్నాయి. చివరి సారిగా పుజారా 2021 ఐపీఎల్లో చెన్నై తరపున ఆడాడు. మరి పుజారాలో వచ్చిన ఈ మార్పుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: పుజారా అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైరు..! సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ 4 2 4 2 6 4 TWENTY-TWO off the 47th over from @cheteshwar1. pic.twitter.com/jbBOKpgiTI — Sussex Cricket (@SussexCCC) August 12, 2022 A century from just 75 balls for @cheteshwar1. Just phemeomenal. pic.twitter.com/z6vrKyqDfp — Sussex Cricket (@SussexCCC) August 23, 2022