చాహల్ ని వరల్డ్ కప్ కి ఎందుకు ఎంపిక చేయలేదు? సెలెక్టర్స్ సెహ్వాగ్ సూటి ప్రశ్న

ఐపీఎల్‌ 2021 రెండో దశలో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగుళూరు స్పిన్నర్‌ యుజ్వేంద్ర చహాల్‌ అదరగొడుతున్నాడు. మొదటి దశలో కూడా మంచి ప్రదర్శన కనబర్చాడు. ఆదివారం ముంబైతో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లలో కేవలం 11 పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన 3 వికెట్లు పడగొట్టాడు. 4 ఓవరల్లో 16 డాట్‌ బాల్స్‌ వేసి ఆర్సీబీ విజయానికి బాటలు వేశాడు. కాగా గత నెలలో ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ 2021 కోసం బీసీసీఐ 15 మందితో కూడిన భారత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. టీమిండియా ప్రపంచకప్‌ జట్టులో యుజ్వేంద్ర చహల్‌కు చోటు దక్కలేదు. స్పినర్లుగా రాహుల్‌ చహర్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌, వరుణ్‌ చక్రవర్తిలను బీసీసీఐ సెలెక్టర్లు ఎంపిక చేశారు.

Verendra Sehwag Sensational Comments on Yuzevendra Chahal - Suman TVఆల్‌రౌండర్‌గా ఉన్న రవీంద్ర జడేజా కూడా స్పిన్‌ వేస్తాడు. ఐపీఎల్ ప్రదర్శన ద్వారా రాహుల్‌ చహర్‌, వరుణ్‌ చక్రవర్తిలు ప్రపంచకప్‌లో చోటు దక్కించుకున్నారు. దాంతో రెగ్యులర్ స్పిన్నర్ అయిన చహాల్‌కు మాత్రం నిరాశే ఎదురైంది. జట్టులో చోటు దక్కనప్పటికీ చహాల్‌ ఐపీఎల్‌లో అద్భుతంగా రాణిస్తుండడంతో టీమిండియా మాజీ క్రికెటర్లు బీసీసీఐ సెలెక్టర్లను ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ కూడా బీసీసీఐపై మండిపడ్డాడు. టీ20 మ్యాచ్‌లలో చహాల్‌ ఇండియాకు విలువైన ఆస్తి అని అతన్ని ఎందుకు ఎంపిక చేయలేదో నాకు అర్థం కావడంలేదని, దీనిపై బీసీసీఐ సెలెక్టర్లు వివరణ ఇస్తే బాగుంటుందని సెహ్వాగ్‌ అన్నాడు. చహాల్‌ ఆట చూస్తున్న అభిమానులు కూడా అతను వరల్డ్‌ కప్‌ జట్టులో ఉంటే బాగుంటుంది అని సోషల్‌మీడియాలో తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరీ చహాల్‌ ను ఎంపిక చేయకపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఐసీసీ టీ20 వరల్డ్‌ కప్‌ టీమిండియా జట్టు ఇదే!