ఐర్లాండ్.. ఈ జట్టు గత కొద్దిరోజులుగా క్రికెట్ అభిమానులను అబ్బురపరుస్తూనే ఉంది. న్యూజిలాండ్ తో జరుగుతున్న వన్డే సిరీస్ లో మూడో మ్యాచ్ లోనూ ఐర్లాండ్ కు పరాజయం తప్పలేదు. ఆఖరి వరకు పోరాటం చేసి ఒక్క పరుగు తేడాతో ఐర్లాండ్ ఓటమిపాలైంది. సినిమాలో డైలాగ్ చెప్పినట్లు ప్రత్యర్థులు మ్యాచ్ గెలిస్తే.. వీరి పోరాట పటిమతో ప్రేక్షకుల హృదయాలను గెలిచారు. సిరీస్ ని న్యూజిలాండ్ వైట్ వాష్ చేసినా.. ఐర్లాండ్ పోరాటానికి సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 360 పరుగులు చేసింది. గప్టిల్(126 బంతుల్లో 115 పరుగులు) శతకంతో చెలరేగాడు. హెన్రీ నికోలస్(79 పరుగులు), గ్లెన్ ఫిలిప్స్(47 పరుగులు) రాణించడంతో న్యూజిలాండ్ భారీ స్కోర్ చేయగలిగింది. ఐర్లాండ్ బౌలింగ్ విషయానికి వస్తే.. జోషువా లిటిల్ 2 వికెట్లు, క్లైగ్ యంగ్, కర్టిస్ కాంఫర్, డెలనీలు తలో వికెట్ తీశారు. Heart-break for our lads, but hats off to the @BLACKCAPS for the ODI series win. Martin Guptill was awarded Player of the Match and Multibagger of the Match, while Michael Bracewell was Player of the Series. On we go to the T20I series!#BackingGreen | #Exchange22 ☘️ pic.twitter.com/TrrKugj3R0 — Cricket Ireland (@cricketireland) July 15, 2022 361 పరుగుల భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ ఎక్కడా తగ్గలేదు. ఒకానొక సమయంలో మ్యాచ్ గెలిచేసిందనే అనుకున్నారు. న్యూజిలాండ్ ప్లేయర్ల కళ్లలో ఓటమి భయం పొట్టొచ్చినట్లు కనిపించింది. పాల్ స్టిర్లింగ్ 103 బంతుల్లో 14 ఫోర్లు, 5 సిక్సుల సాయంతో 120 పరుగులు చేశాడు. హ్యారీ టెక్టర్ ఈ మ్యాచ్ లోనూ అద్భుతంగా రాణించాడు. 106 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సుల సాయంతో 108 పరుగులు చేశాడు. మిగిలిన వారి నుంచి సరైన మద్దతు లేక వీరి శతకాలు వృథా అయ్యాయి. మాట్ హెన్రీ 4 వికెట్లు, మిచెల్ శాంట్నర్ 3 వికెట్లు పడగొట్టారు. A special moment for Paul Stirling. SCORE: https://t.co/iHiY0Un8Zh#BackingGreen | #Exchange22 | #ABDIndiaSterlingReserve ☘️ pic.twitter.com/Tyg4ykcTcW — Cricket Ireland (@cricketireland) July 15, 2022 ఆఖరి ఓవర్లో హైడ్రామా: ఈ మ్యాచ్ మొత్తానికి ఆఖరి ఓవర్‌ను హైలెట్ గా చెప్పచు. ఎందుకంటే చివరి ఓవర్లో పెద్ద హైడ్రామా నడిచింది. విజయానికి 10 పరుగులు కావాల్సి ఉంది. టిక్నర్ బంతిని అందుకున్నాడు. తొలి బంతిని డాట్ బాల్ వేశాడు. ఆ తర్వాత సింగిల్, 4, 1 రనౌట్, 1, 1 రన్స్ మాత్రమే వచ్చాయి. తప్పకుండా గెలుస్తారు అనుకున్న మ్యాచ్ లో ఐర్లాండ్ మరోసారి ఓటమిపాలైంది. దీంతో 3-0 తేడాతో న్యూజిలాంట్ సిరీస్ ని వైట్ వాష్ చేసింది. కానీ, పాల్ స్టిర్లింగ్, టెక్టర్ పోరాటం మాత్రం అద్వితీయం అంటూ ఫ్యాన్స్ ప్రశంసిస్తున్నారు. ఐర్లాండ్ పోరాట పటిమపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. Harry Tector has only been dismissed once before reaching 50 in his last nine ODI innings. What a talent. SCORE: https://t.co/iHiY0Un8Zh#BackingGreen | #Exchange22 | #ABDIndiaSterlingReserve ☘️ pic.twitter.com/LlFUkf0Xe3 — Cricket Ireland (@cricketireland) July 15, 2022 ఇదీ చదవండి: వీడియో: బౌలర్ కర్చీఫ్ కింద పడిందని బ్యాట్స్ మన్ నాటౌట్.. క్రికెట్ చరిత్రలో తొలిసారి! ఇదీ చదవండి: కోహ్లీని కించపరిచేలా మాట్లాడిన పాక్ క్రికెటర్!