సౌత్‌ లండన్‌ పోలీస్‌స్టేషన్‌ నుంచి విడుదలైన ‘జార్వో మావ’

Jarvo 69 Released From South London Police Station - Suman TV

డానియల్‌ జార్విస్‌ అలియాస్‌ జార్వో మావని ఎట్టకేలకు పోలీసులు విడుదల చేశారు. ఓవల్‌ మైదానంలో ఫాస్ట్‌ బౌలింగ్‌ చేసి బెయిర్‌స్టోని ఢీ కొట్టిన ఘటనలో జార్వో 69ను అరెస్టు చేసి.. సౌత్‌ లండన్‌ పోలీస్‌స్టేషన్‌లో కస్టడీలో ఉంచారు. తాజాగా జార్విస్‌ని స్టేషన్‌ నుంచి విడుదల చేశారు. విడుదలయ్యాక నేను ఇప్పుడు ఫ్రీ మ్యాన్‌ని.. తర్వాత ఏం చేస్తే బాగుంటుందంటూ అభిమానులను ప్రశ్నిస్తున్నాడు మన జార్వో మావ‘.

Jarvo 69 Released From South London Police Station - Suman TVఎలాంటి షరతులతో విడుదల చేశారు అన్నది తెలీదు. కానీ, జార్వో మళ్లీ మైదానంలో అడుగుపెడితే ఈసారి ఇంత తేలీగ్గా వదులుతారు అని అయితే అభిమానులు అనుకోవట్లేదు. మరి బుద్ధిగా ఉంటాడో లేక మళ్లీ తన బుద్ధి చూపిస్తాడో చూడాలి. ఇంగ్లాండ్‌ బోర్న్‌ ఇండియన్‌ క్రికెట్‌ ఫ్యాన్‌గా జార్వో మావ బాగానే పోపులర్‌ అయ్యాడు. భారత్‌, ఇంగ్లాండ్‌ టెస్టు సిరీస్‌ మొదలైన దగ్గర్నుంచి ప్రతి సామాజిక మాధ్యమంలో డానియల్‌ జార్విస్‌ పేరు మారు మోగిపోతోంది. భారత్‌ అభిమానులైతే జార్వో మావా అంటూ పిలుచుకుంటున్నారు. రెండో టెస్టులో ఫీల్డింగ్‌.. మూడో టెస్టులో బ్యాటింగ్‌.. నాలుగో టెస్టులో బౌలింగ్‌ చేసేశాడు. మరి మళ్లీ మైదానంలో అడుగు పెడితే ఇక అంపైరింగ్‌ చేస్తాడోమో చూడాలి అంటూ ట్విట్ట్‌రో అభిమానులు ఛలోక్తులు విసురుతున్నారు.