సిగ్గుగా ఉంది.. క్షమించండి: సన్ రైజర్స్ కెప్టెన్ కేన్ విలియమ్సన్

kane williamson

ఐపీఎల్‌ సెకెండాఫ్‌లోనూ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆటతీరు మారలేదు. మళ్లీ అదే పేలవ ప్రదర్శన. బౌలింగ్‌ పరంగా కాస్త పర్లేదు అనిపించినా.. బ్యాటింగ్‌ పరంగా మాత్రం అదే ధోరణి ప్రదర్శించారు. స్కోర్‌ బోర్డు ఓపెనింగే వికెట్‌తో ప్రారంభించింది సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌. 20 ఓవర్లలో కేవలం 134 పరుగులకే పరిమితం కావడం అభిమానులను చాలా నిరాశకు గురిచేసింది. గతంలోనూ చిన్న టార్గెట్‌ను కాపాడుకున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.. శిఖర్‌ ధావన్‌(42), శ్రేయస్‌ అయ్యర్‌(47), రిషబ్‌ పంత్‌(35) రాణించడంతో కట్టడి చేయలేకపోయింది. కేవలం రెండు వికెట్లు కోల్పోయి 17.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది ఢిల్లీ క్యాపిటల్స్‌.

sunrises ipl 2021 teamమ్యాచ్‌ అనంతరం మాట్లాడుతూ కేన్‌ మామ భావోద్వేగానికి గురయ్యాడు. ‘మ్యాచ్‌ స్టార్టింగ్‌లోనే వికెట్లు కోల్పోవడం చాలా ప్రభావం చూపించింది. అలా జరగకపోతే మ్యాచ్‌ ఇంకోలా ఉండేదేమో’ అని కేన్‌ అన్నాడు. మంచి భాగస్వామ్యాలను కూడా నెలకొల్పలేక పోయినట్లు తెలిపాడు. ‘గతంలోనూ చిన్న లక్ష్యాలను కాపాడుకున్నామని.. కానీ, ఈసారి అలా చేయలేకపోవడం కాస్త సిగ్గుగా ఉంది’ అని కేన్‌ విలియమ్సన్‌ భావోద్వేగానికి లోనయ్యాడు. మా ఆటను ఆస్వాదించాలి.. ఒత్తిడికి లోనవ్వకూడదని కేన్‌ తెలిపాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌ అత్యుత్తమ ప్రదర్శన చేసింది. వారిలోని ఇద్దరు అంతర్జాతీయ మేటి ఫాస్ట్‌ బౌలర్లు మమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టారు. ‘మేము మా ఆటను ఇంకా మెరుగుపరుచుకోవాలి’ అని కేన్‌ మామ తెలిపాడు.

విన్నింగ్‌ కెప్టెన్‌ రిషబ్ పంత్‌ మాట్లాడుతూ ‘మొదటి ఫేజ్‌లో మంచి ప్రదర్శన చేశాం.. సెకెండాఫ్‌ని కూడా గెలుపుతో ప్రారంభించడం ఆనందంగా ఉంది’ అని చెప్పాడు.