ప్రస్తుతం భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో ఉంది. మూడు వన్డేల సీరిస్ లో భాగంగా ఇరు జట్లు సీరిస్ లో 1-1తో సమంగా నిలిచాయి. ఈ క్రమంలో జరిగిన మెుదటి మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.. అలాగే ఆ మ్యాచ్ లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ కొట్టిన సిక్సర్ ఓ చిన్నారి మీరా సాల్వీకి తాకింది. వెంటనే ఇంగ్లాండ్ ఫిజియో వచ్చి చిన్నారికి ప్రథమ చికిత్స అందించాడు. మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ ఆ చిన్నారి దగ్గరకు వెళ్లి ఆప్యాయంగా పలకరించడమే కాకుండా.. ఆ చిన్నారికి ఓ టెడ్డి బేర్ తో పాటు కొన్ని చాకెట్లు సైతం బహుకరించాడు. అదీకాక ఇంగ్లాండ్ జట్టు కూడా మీరా సాల్వీ కి తమ జట్టు జెర్సీని అందజేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించి మరో వార్త మీడియాలో చెక్కర్లు కొడుతోంది.. మరి ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం పదండి.. Rohit Sharma met the girl after the match who got injured by Rohit's six and gave her chocolate. Nice gesture by the Indian Captain pic.twitter.com/thFlfro1Bb — Cricket is love ❤ (@cricketfan__) July 13, 2022 కెప్టెన్ రోహిత్ శర్మ తనదైన ఆటతో, పదునైన వ్యూహాలతో ప్రత్యర్ధిని ఉక్కిరి.. బిక్కిరి చేస్తూ ఉంటాడు. కానీ ఇప్పుడు తాను చేసిన పనితో ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టాడు. మ్యాచ్ సమయంలోనే రోహిత్ శర్మ మీరా సాల్వి తండ్రి ఫోన్ నంబరు తీసుకున్నట్లు సమాచారం. ఆ తర్వాత మీరా సాల్వి తండ్రికి కాల్ చేసి ఆమె యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. మరి తన మంచి మనసును చాటుకున్న రోహిత్ శర్మపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. Meera Salvi, a six year old girl in crowd was hit on the back by a six by #RohitSharma . Game temporarily halted to see whether girl had sustained any injuries. Girl received medical care, and match continued. Rohit took her father's phone no. Team England gifted her a Jersey. pic.twitter.com/Hi20JYhjAi — ROHIT Era™ (@TheRohitEra) July 14, 2022 ఇదీ చదవండి: పసికూన కాదు.. న్యూజిలాండ్ ని వణికించిన ఐర్లాండ్! ఆఖరి ఓవర్లో.. ఇదీ చదవండి: వీడియో: బౌలర్ కర్చీఫ్ కింద పడిందని బ్యాట్స్ మన్ నాటౌట్.. క్రికెట్ చరిత్రలో తొలిసారి!