దీపక్‌ చాహర్‌ ప్రపోజ్ చేసిన ఈ అమ్మాయి ఎవరంటే?

టీమిండియా ఆటగాడు, చెన్నై సూపర్‌ కింగ్స్‌ స్టార్‌ పేసర్‌ దీపక్‌ చాహర్‌ గురువారం తన గర్ల్‌ఫ్రెండ్‌కు అందరి ముందు స్టేడియంలో ప్రపోజ్‌ చేసి సర్‌ప్రైజ్‌ చేశాడు. దానికి ఆమె కూడా అంగీకరం తెలిపి దీపక్‌ను హత్తుకుంది. సినిమాల్లో చేసినట్లు మొకాళ్లపై కూర్చోని రింగ్‌ ఇస్తూ ప్రపోజ్‌ చేశాడు. అప్పటి వరకు చెన్నై మ్యాచ్‌ ఓటమితో బిక్కమొహం వేసిన సీఎస్‌కే అభిమానులు, ఆటగాళ్లు దీపక్‌ చేసిన పనితో ఫుల్‌ ఖుష్‌ అయ్యారు. దీంతో అసలు ఇంతకీ దీపక్‌ చాహర్‌ మనసు దోచిన ఆ అమ్మాయి ఎవరు? పేరు, ఊరు, నేపథ్యం గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ఆరాటపడ్డారు.

కొన్ని ఏళ్లుగా ప్రేమలో..

కొన్ని ఏళ్లుగా దీపక్‌ ఆమెతో ప్రేమలో ఉన్నాడు. ఆ విషయం టీమిండియా ఆటగాళ్లకు, సీఎస్‌కే ఆటగాళ్లుకు తెలుసు. దీపక్‌తో కలిసే ఆమె యూఏఈకి వచ్చింది. సీఎస్‌కే ఫ్యామిలీస్‌తో పాటు బయో బబుల్‌లోనే ఉంటుంది. దీపక్‌ ఆమెను గతంలో సహచర ఆటగాళ్లకు పరిచయం కూడా చేశాడు. కానీ ఎక్కడా కూడా బహిరంగంగా వారిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు బయటికి రాకుండా జాగ్రత్త పడ్డాడు. మొత్తాని గురువారం తన ప్రేమను, ప్రేయసిని ప్రపంచానికి పరిచయం చేశాడు.

Deepak Chahar Girlfriend Biography - Suman TV
ప్రముఖ నటుడి చెల్లెలు.. బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌

దీపక్‌ చాహార్‌ ప్రపోజ్‌ చేసిన అమ్మాయి పేరు జయ భరద్వాజ్, 29 ఏళ్ల ఈ అమ్మాయి ఢిల్లీలో పుట్టిపెరిగింది. మాస్‌ కమ్యూనికేషన్‌ చదువుకుని ప్రముఖ న్యూస్‌ చానెల్‌ బీబీసీలో పనిచేసింది. ప్రస్తుతం ఒక ప్రముఖ కంపెనీలో బిజినెస్‌ ప్రోఫెషనల్‌గా పనిచేస్తుంది. జయ హిందీ బిగ్‌బాస్‌ సీజన్‌ 5 కంటెస్టెంట్‌ కూడా. ఆమె అన్న సిద్ధార్థ్‌ భరద్వాజ్‌ నటుడు, మోడల్‌. ఎమ్‌ టీబీలో వచ్చే ప్రముఖ షో స్పిట్స్‌విల్లా 2 విన్నర్‌. బిగ్‌బాస్‌ 5లో సెలబ్రెటీ కంటెస్టెంట్‌. ఒక హిందీ మూవీలో కూడా నటించాడు. యూఏఈలో గురువారం దీపక్‌ చాహార్‌ ప్రపోజ్‌ చేయడంతో ఒక్క సారిగా ఫేమస్‌ అయిపోయింది.

ఇదీ చదవండి: దీపక్ చాహర్ లవ్ సక్సెస్ కావడానికి ధోని కారణమా?

 

View this post on Instagram

 

A post shared by Deepak Chahar (@deepak_chahar9)