పొలార్డ్‌ని ఉడికించిన ప్రసిద్ధ్‌.. చుక్కలు చూపించిన కరేబియన్‌ పవర్‌ హిట్టర్‌

prasidh krishna pollard

యూఏఈ వేదికగా ఐపీఎల్‌ 2021 సెకెండాఫ్‌ ఫుల్‌ జోష్‌తో నడుస్తోంది. ప్రతి మ్యాచ్‌ ఆఖరి వరకు ఉత్కంఠగా సాగుతోంది. ముంబయి, కేకేఆర్‌ మ్యాచ్‌ పూర్తిగా వన్‌సైడెడ్‌గా సాగింది. టాస్‌ గెలిచి ఫీల్డిండ్‌ ఎంచుకున్న కోల్‌కతా తొలుత కొంచం పట్టు తప్పినట్లు కనిపించినా.. ముంబయి విధ్వంసకర బ్యాటింగ్‌ చేయకుండానే  కట్టడి చేశారు. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది ముంబయి టీమ్‌. ఓపెనర్లు రోహిత్‌ శర్మ, క్వింటన్‌ డీకాక్‌ మినహా ముంబయి బ్యాట్స్‌మన్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ 15.1 ఓవర్లలోనే కేవలం మూడు వికెట్ల నష్టానికి 156 విజయలక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. రాహుల్‌ త్రిపాఠి(42 బంతుల్లో 74 పరుగులు), వెంకటేశ్‌ అయ్యర్‌(30 బంతుల్లో 53 పరుగులు) ఇద్దరి మెరుపు బ్యాటింగ్‌తో కేకేఆర్‌కు విజయం పెద్ద కష్టం కాలేదు. జాస్ప్రిత్‌ బుమ్రా మినహా ముంబయి బౌలర్లు ఎవరూ ప్రభావం చూపలేకపోయారు. పడిన 3 వికెట్లు బుమ్రాకే దక్కడం విశేషం. ఆఖర్లో రోహిత్‌ శర్మ కూడా బౌలింగ్‌కు దిగాడు. తొలి బంతికే ఫోర్‌ కొట్టడంతో కేకేఆర్‌ విజయ తీరాలు చేరుకుంది. బౌలింగ్‌ పరంగా కూడా కేకేఆర్‌ ఉత్తమ ప్రదర్శన చేసింది. రస్సెల్‌(3 ఓవర్లకు 37 పరుగులు), ప్రసిద్ధ్‌(4 ఓవర్లలో 43 పరుగులు) మినహా నితిశ్‌ రానా, వరుణ్‌ చక్రవర్తి, నరైన్‌, ఫెర్గుసన్‌ ఎకానమీ 7లోపే బౌలింగ్‌ చేశారు. మ్యాచ్‌కు ముందు పాయింట్ల పట్టికలో కేకేఆర్‌ ఆరో స్థానం, ముంబయి నాలుగోస్థానంలో ఉండగా మ్యాచ్‌ అనంతరం స్థానాలు ఎక్స్‌ఛేంజ్‌ జరిగి.. కోల్‌కతా నాలుగో స్థానం, ముంబయి ఆరో స్థానానికి చేరింది. 9 మ్యాచ్‌లలో 4 విజయాలు, 5 పరాజయాలు, 8 పాయింట్లతో నాలుగులో స్థానంలో ఉంది.

prasidh krishna pollard compressedకదిలించి.. కొట్టించుకున్నప్రసిద్ధ్‌ కృష్ణ

పొలార్డ్‌ స్వతహాగానే మైదానంలో చాలా కోపంగా ఉంటాడు. అందరితో పరాచకాలాడినట్లు పొలార్డ్‌తో ఆడితే కష్టం. ఒకసారి కాస్త ఉడికించినందుకే మిచెల్‌ స్టార్క్‌పైకి బ్యాట్‌ విసిరాడు. ఓ మ్యాచ్‌లో వైడ్‌ ఇవ్వలేదని.. దూరంగా వెళ్లి స్టాన్స్‌ తీసుకున్న విషయం తెలిసిందే. దాదాపుగా ఏ బౌలర్‌ కూడా పొలార్డ్‌ జోలికి పోరు. సరదాగా ప్రసిద్ధ్‌ చేసిన పనికి పొలార్డ్‌ నోటితో బ్యాట్‌తో సమాధానం చెప్పాడు. అప్పటివరకు నవ్వుతూ ఉన్న ప్రసిద్ధ్‌ కృష్ణ డీలాగా మారిపోయాడు. 18వ ఓవర్‌కు వచ్చిన ప్రసిద్ధ్‌ను మొదటి బంతికి సిక్స్‌, రెండో బంతికి ఫోర్‌ కొట్టడంతో ఒత్తిడికి లోనైన ప్రసిద్ధ్‌ నోబాల్‌, రెండు వైడ్లు వేశాడు. తర్వాతి ఓవర్‌లో పొలార్డ్‌(15 బంతుల్లో 21) సింగిల్‌ కోసం ట్రై చేస్తూ రనౌట్‌గా వెనుదిరిగాడు.