ఆసియా కప్ 2022లో భాగంగా సూపర్ ఫోర్లో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓటమి చవిచూసింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో టీమిండియా చెత్త ఫీల్డింగ్‌తో భారీ మూల్యాన్ని చెల్లించుకుంది. పాకిస్థాన్‌తో కీలకమైన మ్యాచ్‌లో టీమిండియా ఓటమికి చాలా కారణాలే ఉన్నా.. యువ పేసర్ అర్షదీప్ సింగ్ ఒక సులవైన క్యాచ్‌ను నేలపాలు చేసి తీవ్ర విమర్శల పాలవుతున్నాడు. 16 బంతుల్లో పాకిస్థాన్‌కు 31 పరుగులు అవసరమైన సమయంలో రవి బిష్ణోయ్ వేసిన 18వ ఓవర్ రెండో బంతికి పాక్ పవర్ హిట్టర్ ఆసీఫ్ అలీ చెత్త షాట్ ఆడి బంతిని షార్ట్ థర్డ్ మ్యాన్ వద్ద గాల్లోకి లేపుతాడు. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న అర్షదీప్ సింగ్ చేతుల్లోకి బంతి వెళ్లింది. కానీ.. అందర్ని షాక్‌కు గురి చేస్తూ.. అర్షదీప్ సింపుల్ క్యాచ్‌ను నేలపాలు చేశాడు. అప్పటికీ ఆసిఫ్ అలీ చేసిన పరుగులు సున్నా.. ఆ తర్వాత మళ్లీ ఆసిఫ్ అలీని అర్షదీప్ సింగే చివరి ఓవర్లో అవుట్ చేసినా.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అర్షదీప్ ఇచ్చిన లైఫ్‌తో చెలరేగిన ఆసిఫ్ అలీ 8 బంతుల్లోనే రెండు ఫోర్లు, ఒక సిక్స్‌తో పాక్ విజయాన్ని లాంఛనం చేశాడు. ఇక కీలమైన సమయంలో అర్షదీప్ క్యాచ్ వదిలేయడంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. పట్టరాని కోపంతో గట్టిగా అరుస్తాడు. ఆ క్యాచ్ ఎంత విలువైందో రోహిత్‌కు తెలియడంతో అంతలా రియాక్ట్ అయ్యాడు. రోహిత్ శర్మ ఆవేశం చూసిన క్రికెట్ అభిమానులు.. క్యాచ్ వదిలేసిన అర్షదీప్ సింగ్ దగ్గరుంటే రోహిత్ కొట్టేసే వాడంటూ సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు. ఇక మ్యాచ్‌లో టీమిండియా బౌలింగ్, మిడిల్డార్ బ్యాటింగ్ వైఫల్యంతోనే ఓడిందనేది కాదనలేని సత్యం. కాగా.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 181 పరుగులు సాధించింది. కోహ్లీ 60 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పాక్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ రెండు, నషీమ్ షా, హూస్నైన్, రౌఫ్, నవాజ్ తలో వికెట్ తీసుకున్నారు. టీమిండియా నిర్దేశించిన లక్ష్యాన్ని పాక్ 19.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ మొహమ్మద్ రిజ్వాన్ 51 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులతో 71 పరుగులుచేసి రాణించాడు. నవాజ్ 20 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులతో 42 పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో ఆసిఫ్ అలీ రెండు ఫోర్లు, ఒక సిక్స్‌తో విలువైన 16 పరుగులు చేశాడు. ఇక భారత బౌలర్లలో రవి బిష్ణోయ్, అర్షదీప్, భువీ, పాండ్యా, చాహల్ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో చాహల్, పాండ్యా, భువీ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. మరి ఈ మ్యాచ్‌లో అర్షదీప్ క్యాచ్ డ్రాప్ చేయడం, అందుకు రోహిత్ శర్మ రియాక్ట్ అయిన విధానంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. #ArshdeepSingh Trolled Heavily On Social Media For Dropping Asif Ali's Catch In The Super-4 Match Of #AsiaCup. pic.twitter.com/AGRIoLTWYt — The Ink And Paper (@theinkandpaper) September 4, 2022 So many years for Rohit Sharma to finally realise how it feels to be a Pakistani captain pic.twitter.com/0fI0LEa7nf — PSL Memes (@PSLMemesWalay) September 4, 2022 When your investment gives you 200% return, Thank you Arshdeep Singh ❤️ #INDvsPAK2022 pic.twitter.com/WLGNgQ8Iho — ENTEI (@ZEUS_PSF) September 4, 2022