టీమిండియా ప్రస్తుతం బిజీ షెడ్యూల్ లో ఉన్న విషయం తెలిసిందే. ఇంగ్లాండ్ తో ఒక టెస్టు సహా మొత్తం 7 మ్యాచుల్లో తలపడాల్సి ఉంది. ఐర్లాండ్ తో రెండు టీ20ల్లో హార్దిక్ పాండ్యా సేన తలపడనుంది. అయితే ప్రస్తుతం అన్ని జట్లు ఇంతలా బిజీగా గడపడానికి.. అంతలా శిక్షణ తీసుకోవడానికి ఒకటే కారణం. ఆస్ట్రేలియాలో జరగనున్న ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్-2022 కోసమే. అందుకే టీమిండియా సహా అన్ని జట్లు ఈ గ్యాప్ లో వీలైనన్ని ఎక్కువ మ్యాచ్ లు ఆడేందుకు ప్రయత్నిస్తున్నాయి. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ అటు సీనియర్లకు అవకాశం కల్పిస్తూనే వీలైనప్పుడల్లా.. యంగ్ ప్లేయర్లను కూడా టెస్ట్ చేస్తున్నాడు. కుర్రాళ్లకు అవకాశాలు కల్పిస్తూ.. వారిని టెస్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం రాహుల్ ద్రవిడ్ ముందు ఆప్షన్స్ ఉన్నాయనే చెప్పాలి. అయితే వారిలో ఎవరికి ఆస్ట్రేలియా ఫ్లైట్ టికెట్ దొరుకుతుందో వేచి చూడాల్సిందే. అయితే మాజీలు చాలా మంది తమతమ అభిప్రాయాలను చెప్తూ వస్తున్నారు. ఎవరికి టీ20 ప్రపంచకప్ లో అవకాశం ఇస్తే బావుంటుంది? మేము మెచ్చిన జట్టు ఇదే అంటూ వారివారి అభిప్రాయాలను చెప్తూ వస్తున్నారు. అయితే అదే అంశంపై టీమిండియా మాజీ పేసర్, గుజరాత్ టైటాన్స్ కోచ్ ఆశిష్ నెహ్రా స్పందించాడు. Ashish Nehra on Shami's selection with ICT pic.twitter.com/OiJDeJb1ur — RVCJ Media (@RVCJ_FB) June 18, 2022 ఎవరికి చోటు దక్కుతుందో విషయాన్ని పక్కన పెడితే టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీకి మాత్రం ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్ కప్ కు అవకాశం దక్కదని అభిప్రాయపడ్డాడు. ఇంగ్లాండ్ టూర్ లో టెస్టు మ్యాచ్ తర్వాత మూడు వన్డేల్లో షమీకి అవకాశం దక్కుతుందని భావిస్తున్నానన్నాడు. షమీలాంటి ప్లేయర్‌ను ఇంగ్లాండ్ లాంటి ఉత్తమ జట్టుపై బౌలింగ్ చేసేందుకు తానైతే తప్పకుండా ఎంపిక చేస్తానని చెప్పాడు. అయితే భారత్‌లో జరగనున్న 2023 వరల్డ్ కప్‌లో మాత్రం షమీకి తప్పకుండా అవకాశం దక్కుతుందని ఆశిష్ నెహ్రా చెప్పుకొచ్చాడు. టీ20 వరల్డ్ కప్ లో షమీపై ఆశిష్ నెహ్రా చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. Former India pacer Ashish Nehra makes a BIG statement on Mohammed Shami's T20 World Cup chances : BCCI#Cricket #TeamIndia #IndianCricketTeam #T20WorldCup #CricketTwitter pic.twitter.com/lXlTGWDApU — CricketTiger (@cric_tiger) June 19, 2022 ఇదీ చదవండి: అరుదైన ఘనత సాధించిన భువనేశ్వర్.. టీమిండియాలోనే తొలి పేసర్‌గా! ఇదీ చదవండి: రాహుల్ కు జర్మనీలో చికిత్స.. గాయం తీవ్రమైందా?