మేము కోరుకున్నది ఇది కాదు.. విరాట్‌ కోహ్లీ ఎమోషనల్‌ పోస్ట్‌

Virat Tweet

ఐపీఎల్‌ 2021’ సీజన్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు పోరాటం ముగిసింది. కోహ్లీ కెప్టెన్‌ ఆఖరి సీజన్‌లోనైనా ఆర్సీబీ ట్రోఫీ సాధిస్తుందని ఎదురుచూసిన అభిమానులకు నిరాశే ఎదురైంది. అలా జరిగినందుకు అభిమానులే కాదు.. కోహ్లీ, డివిలియర్స్‌ కూడా మైదానంలోనే ఏడ్చేశారు. వారి ద్వయంలో ఆర్సీబీ కప్పు కొట్టలేకపోవడం అభిమానులకు చాలా బాధకర విషయం. కొందరు అభిమానులు అయితే సహనం కోల్పోయి ఆర్సీబీ ప్లేయర్లను తిడుతూ పోస్టులు కూడా పెట్టారు. ఏది ఏమైనా ఆట అన్నాక గెలుపు, ఓటములు సహజం ఆ మాత్రానికే సహనం కోల్పోవడం కరెక్ట్‌ కాదు అని క్రికెట్‌ పండితులు హితవు పలికారు. కేకేఆర్‌తో ఓటమిపై కోహ్లీ కూడా స్పందించాడు. ఇప్పుడు ఆ ట్వీట్‌ వైరల్‌ అవుతోంది.

ఇదీ చదవండి: RCB ఓటమికి కారణం కోహ్లీనే.. గంభీర్ సంచలన కామెంట్స్!

ఇప్పటివరకు ఈ సీజన్‌లో ఎంతో బాగా ప్రదర్శన చేసిన ఆర్సీబీ కేకేఆర్‌ చేతిలో ఎంతో సునాయాసంగా ఓడిపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. ‘మేము కోరుకున్న ఫలితం ఇది కాదు. కానీ, సీజన్‌ మొత్తం ఆర్సీబీ ఆటగాళ్లు చూపించిన పోరాట పటిమ చూసి ఎంతో గర్వంగా ఉంది. ఇది ఊహించని ఓటమే అయినా.. మనం తలెత్తుకుని నిలబడవచ్చు. ఇంత బాగా సపోర్ట్‌ చేసిన ఫ్యాన్స్‌, మేనేజ్‌మెంట్‌, సపోర్ట్‌ స్టాఫ్‌ అందరికీ ధన్యవాదాలు’ అంటూ విరాట్‌ కోహ్లీ భావోద్వేగంగా ట్వీట్‌ చేశాడు. ఆశించిన ఫలితం రాకపోయినా.. బాధపడాల్సిన పనిలేదు, మన పోరాటం మనం చేశాం. అనే విధంగా కోహ్లీ పోస్ట్‌ చేశాడు. ఆర్సీబీ ట్రోఫీ సాధించకపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్‌ చేయండి.