గిన్నిస్ రికార్డుకెక్కిన 119 ఏళ్ల బామ్మ కన్నుమూత!

పూర్వ కాలంలో మనిషి ఆయుష్షు కనీసం వంద సంవత్సరాలు వరకు ఉండేదట. కానీ కాలం మారింది ఇప్పుడు మనిషి ఆయుష్షు ఎనభై సంవత్సరాలు అంటే మహా ఎక్కువ. కాలుష్యం, మనం తింటున్న కలుషితమైన ఆహార పదార్థాలు ఇలా ఎన్నో కారణాల వల్ల మనిషి ఆయుష్షు తగ్గిపోతుంది. కానీ నైరుతి జపాన్‌లోని ఫుకోకా పట్టణానికి చెందిన కానే టనాకా అనే మహిళ 119 సంవత్సరాల వరకు బతికింది. కానే జనవరి 2, 1903న నైరుతి జపాన్‌లోని ఫుకుయోకా ప్రాంతంలో జన్మించారు.  అదే సంవత్సరంలో, రైట్ సోదరులు వారి స్వంత విమానంలో మొదటిసారి ప్రయాణించారు. అలాగే మేరీ క్యూరీ నోబెల్ బహుమతిని అందుకున్న మొదటి మహిళగా నిలిచారు.

ఇది చదవండి: రాజమౌళి గురించి 12 ఏళ్ల క్రితం నేను చెప్పిందే నిజమయ్యింది: నటుడు

image 1 compressed 123

ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ వయసున్న వ్యక్తిగా గిన్నిస్‌ పుస్తకంలో చోటు సంపాదించిన కానే టనాకా 119 వ ఏట కన్నుమూశారు. ఈ నెల 19 న తుదిశ్వాస విడిచారని జపాన్‌ ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ఆమె 116 ఏళ్ల వయసులో మార్చి 2019లో ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ వయసున్న వ్యక్తిగా గిన్నిస్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నారు. ఆ తర్వాతి ఏడాది కూడా ఆమె మరోమారు రికార్డులకెక్కారు.

ఇది చదవండి : 5 ఏళ్ళ కూతురుపై కన్నతండ్రి అఘాయిత్యం!

image 3 compressed 7117 సంవత్సరాల 261 రోజుల వయసులో అత్యంత ఎక్కువ కాలం జీవించిన జపాన్ వ్యక్తిగా ప్రపంచంలోనే ఎక్కువ కాలం జీవించిన రెండో వ్యక్తిగా రికార్డు సొంతం చేసుకున్నారు. 1922 లో 19వ ఏట హిడియో ఠనాకా అనే వ్యక్తిని పెళ్లాడారు. ఈ దంపతులకు నలుగురు సంతానం. మరొకరిని దత్తత తీసుకున్నారు. 1937లో రెండో చైనా-జపాన్‌ యుద్ధంలో పాల్గనేందుకు భర్త, పెద్ద కుమారుడు వెళ్లిన సమయంలో.. కానే నూడుల్స్‌ దుకాణాన్ని నడిపారు. సోడా, చాక్లెట్‌ సహా రుచికరమైన ఆహారం తీసుకోవడం వల్ల తాను ఇంత ఆరోగ్యంగా ఉన్నానని కానే చెప్పేవారు. కానే టనాకా రెండుసార్లు క్యాన్సర్ నుండి బయటపడింది.

image 2 compressed 51ఆమె జీవితంలో అనేక చారిత్రక సంఘటనలకు సాక్ష్యంగా నిలిచింది. రెండు ప్రపంచ యుద్ధాలు, 1918 స్పానిష్ ఫ్లూ — అలాగే కోవిడ్-19 మహమ్మారి నుంచి కూడా ఆమె బయటపడింది. కానే టనాకా మృతితో ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వృద్ధ వ్యక్తిగా ఫ్రాన్స్‌ మహిళ లుసిలీ రాండన్‌ నిలిచారు. ఆమె వయసు 118 సంవత్సరాల 73 రోజులు.   2021లో జరిగిన చైనా ఒలింపిక్స్​లో చక్రాల కుర్చీలో కూర్చుని టార్చ్ రిలేలో పాల్గొనాలని టనాకా ఆశపడింది. అయితే కరోనా కారణంగా అది సాధ్యపడలేదు.

  • మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.