నేటి ఆధునిక కాలంలో టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. అందుకు తగ్గట్టుగానే కొత్త కొత్త ఆవిష్కరణలు సైతం వెలుగులోకి వస్తున్నాయి. ఒక్క చనిపోయిన వ్యక్తి ని బతికించడం తప్ప వైద్యరంగంలో అన్ని శస్త్రచికిత్సలు చేస్తున్నారు. తాజాగా మెడ 90 డిగ్రీలు పక్కకు తిరిగిన అమ్మాయికి విజయవంతంగా ఆపరేషన్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడే ఓ విశేషం కూడా ఉంది. దానికి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. ''ఆపదలో ఉంటే శత్రువుకైనా సాయం చేయాలి'' అన్నదే సనాతన భారతీయ ధర్మం. సాధారణంగా మన పక్కింటి వారితో గొడవ జరిగితేనే మనం వారితో మాట్లాడం. వారింట్లో మనిషి చనిపోయినా ఏమీ పట్టించుకోకుండా ఉంటాం. అలాంటిది మన శత్రు దేశానికి చెందిన వారికి సహాయం చేయాల్సి వస్తే ఆలోచిస్తాం. కానీ ఆయన మాత్రం అలా ఆలోచించలేదు. తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తించి నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆయనే రాజగోపాలన్.. ఢిల్లీకి చెందిన ప్రముఖ వైద్యుడు. అప్షీన్ గుల్ .. పాకిస్థాన్ కు చెందిన 12 ఏళ్ల అమ్మాయి. సింద్ ఫ్రావిన్స్ కు చెందిన అఫ్షీన్ 10 నెలల వయసులో ఉన్నప్పుడు ప్రమాదానికి గురైంది. దాంతో ఆమె మెడ 90 డిగ్రీలు పక్కకు తిరిగింది. అప్పడి నుంచి గుల్ అవస్థలు వర్ణణాతీతం. అదీకాక దీనికి తోడు ఆమెకు సెరిబ్రల్ పాల్సీ అనే మరో వ్యాధితోడైంది. ఎంత మంది వైద్యులకు చూపించినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో అఫ్షీన్ పరిస్థితి తెలుసుకున్న ఓ పాక్ నటుడు అమె ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అలా ఆ ఫొటోలు డాక్టర్ రాజగోపాలన్ దృష్టికి వచ్చాయి. దీంతో ఆయన బాలిక తల్లిదండ్రులను సంప్రదించడమే కాకుండా.. ఆమెను ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రికి తిసుకొచ్చి.. ఉచితంగా 4 ఆపరేషన్ లు చేశాడు. దాంతో ఆ బాలిక తిరిగి సాధారణ స్థితికి వచ్చింది. అందుకే అంటారేమో డాక్టర్ దేవునితో సమానం అని. అరుదైన సమస్యతో బాధపడుతున్న అఫ్షీన్ గుల్ కు కొత్త జీవితాన్ని అందించిన డాక్టర్ రాజగోపాలన్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. View this post on Instagram A post shared by Afsheen Gul (@afsheengul786) ఇదీ చదవండి: Rushikeshava: రియల్ శివమణి.. ఆ CI చనిపోతే ఊరు ఊరంతా కదిలింది.. సెల్యూట్ సార్! ఇదీ చదవండి: 22 ఏళ్లుగా స్నానం చేయలేదు.. ఎందుకో తెలుసా?