రాజకీయాలలో చాలా మంది నాయకులు తమదైన ముద్ర వేస్తారు. తమ పాలన ద్వారానో, లేదా తాము తెచ్చిన చట్టాలతోనో, పథకాలతోనో ప్రజల నోళ్లల్లో నానుతారు. కానీ కొంత మంది మాత్రం తమ విచిత్రమైన బాడి లాగ్వేజీతో ప్రజల్లో నిలిచిపోతారు. అలాంటి వ్యక్తే ‘ప్రజాశాంతి’ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల గురించి స్పందించారు. దానికి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
కేఏ పాల్.. రెండు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. తన విచిత్రమైన హావ భావాలతో, ప్రకటనలతో ప్రజల్లో నిలిచిపోయారు. గత ఎన్నికల ప్రచారంలో కేఏ పాల్ చేసిన రచ్చ అంతా.. ఇంతా కాదు. దాంతో ఒక్కసారిగా ఆయన సోషల్ మీడియాలో పాపులర్ అయిపోయాడు. ఈ క్రమంలో తాజాగా మీడియాతో మాట్లాడుతూ..”తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబులు వంద వాగ్దానాలు చేసి ఒక్కటి కూడా అమలు చేయలేదని” అన్నారు.
ఇక తన పార్టీ ఎవ్వరికీ మద్దతు ఇవ్వదని స్పష్టం చేశారు. అలాగే రాష్ట్రంలో ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి రావడం అవసరం అన్నారు. ”కేఏ పాల్ రావాలి.. పాల్ తోనే పాలన మారాలి..” ఇదే మా నినాదం అని వెల్లడించారు. రాష్ట్రానికి డబ్బులు ఎలా తేవాలి.. ఎలా ఖర్చు చేయాలో తనకు తెలుసని అన్నారు. జగన్ కు హామీలు అమలు చేయాలని ఉన్నా డబ్బు లేదని తెలిపారు. త్వరలోనే సీఎం జగన్ ను కలిసి తనకు మద్దతు ఇవ్వాలని కోరతానన్నారు. ఈ నేపధ్యంలో రాబోయే ఎన్నికల్లో 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీ స్థానాలకు పోటి చేస్తామని స్పష్టం చేశారు. ఈ సారి తాను ఓడిపోనని.. గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. మరి కేఏ పాల్ చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.