నథింగ్ నుంచి పాన్ ఇండియా స్టార్ రేంజ్ కి ఎదిగిన హీరో యష్. కేజీఎఫ్ అనే ఒక్క సినిమాతో మొత్తం సినీ ప్రపంచాన్ని కన్నడ ఇండస్ట్రీ వైపు చూసేలా చేశారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్- హీరో యష్. ఇప్పుడు కేజీఎఫ్ చాప్టర్-2తో పాత రికార్డులను బద్దలు కొట్టేందుకు సిద్ధమైపోయారు. కేజీఎఫ్-2 ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానున్న సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా సినిమా బృందం జోరుగా ప్రమోషన్స్ చేస్తోంది. అందులో భాగంగా వైజాగ్ లో తెలుగు మీడియాతో హీరో యష్ ఇంటరాక్ట్ అయ్యాడు. ఎన్నో ఆసక్తికర అంశాలను పంచుకున్న యష్ బాలీవుడ్ ఎంట్రీపై కూడా క్లారిటీ ఇచ్చేశాడు.
ఇదీ చదవండి: బాలీవుడ్ లో నటించాల్సిన అవసరం ఏముంది?: మహేశ్ బాబు
మీరు డైరెక్ట్ బాలీవుడ్ సినిమాలో ఎప్పుడు నటిస్తారు అనే ప్రశ్నకు యష్ షాకింగ్ రిప్లై ఇచ్చాడు. ‘అసలు బాలీవుడ్లో నటించాల్సిన అవసరం ఏముంది? మా ఇండస్ట్రీ అంటే మాకు చాలా గౌరవం ఉంది. అలాగే బాలీవుడ్ ఇండస్ట్రీ అన్నా కూడా మంచి రెస్పెక్ట్ ఉంది. మా సినిమాలో సంజయ్ సార్, రవీనా ఉన్నారు. రావు రమేశ్, ప్రకాశ్ రాజ్ ఉన్నారు. ఇలా అన్ని ఇండస్ట్రీలతో కలిసి పనిచేస్తున్నాం’ అంటూ యష్ సమాధానం చెప్పాడు. అయితే డైరెక్ట్ హిందీ సినిమాల్లో నటించేది లేదని తేల్చేశాడు. పాన్ ఇండియా సినిమాలు వస్తున్నప్పుడు బాలీవుడ్ సినిమాల్లో ప్రత్యేకంగా నటించాల్సిన అవసరం ఏముంది అనే కోణంలో యష్ సమాధానం చెప్పాడు.బాలీవుడ్ ఎంట్రీపై ఇటీవల సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా స్పందించిన విషయం తెలిసిందే. ‘బాలీవుడ్ సినిమాలో నటించాల్సిన అవసరం ఏముంది? తెలుగు సినిమాలో నటిస్తాం.. ఆ సినిమా అన్ని భాషల్లో విడుదల అవుతుంది. ప్రస్తుతం ఆ ట్రెండే కదా నడుస్తోంది’. అంటూ సమాధానం చెప్పడం చూశాం. ఇప్పుడు యష్ కూడా అదే స్టైల్‌లో సమాధానం చెప్పాడు. గతంలో బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం తెలుగు లాంటి రీజనల్ భాషల్లో నటించను అని చెప్పిన సమాధానికి సౌత్ హీరోలంతా కౌంటర్ ఇస్తున్నారు అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం యష్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. యష్- మహేశ్ బాబు చేసిన వ్యాఖ్యలు సరైనవేనా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.