టాలీవుడ్.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పేరే మారుమ్రోగుతోంది. ఇండియన్ సినిమాకు టాలీవుడ్ పర్యాయపదంగా మారుతోంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఒకప్పుడు టాలీవుడ్ అంటే ఏదో రీజనల్ సినిమాలు అని చిన్నచూపు చూసే పరిస్థితి నుంచి ఖండాంతరాలు దాటి రికార్డులు సృష్టిస్తుంటే స్థాయికి చేరుకున్నాం. ఈ ఘనతకు, ఈ స్థాయికి ఆధ్యుడు, ఆర్జం పోసినవాడు దర్శకధీరుడు రాజమౌళి అని ఒప్పుకోక తప్పదు. బాహుబలి అనే సినిమాతో ప్రపంచం దృష్టిని ఇండియన్ సినిమా, టాలీవుడ్ వైపు ఆకర్షించాడు. ఇప్పుడు ఏ హీరో, ఏ డైరెక్టర్, ఏ ప్రొడ్యూసర్ ఓ పాన్ ఇండియా సినిమా తీసినా.. దాని వెనకాల రాజమౌళి ఉన్నాడనే చెప్పాలి. అంతటి ఆత్మ విశ్వాసాన్ని నిర్మాతల్లో.. హీరోల్లో నింపాడు.
ఇదీ చదవండి: ‘హనుమాన్ జయంతి’ రోజున చిరంజీవి స్పెషల్ ట్వీట్! వీడియో వైరల్!
బాలీవుడ్ కూడా చిన్నబోయేలా టాలీవుడ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొడుతున్నాయి. అప్పటి బాహుబలి నుంచి నిన్నమొన్నటి ట్రిపులార్ వరకు ఇండియన్ సినిమాలో మనదే హవా. ఇంకా రానున్న సినిమాల జాబితాలోనూ మన మార్క ఉండక మానదు. ఇండియాలో రానున్న రోజుల్లో విడుదలయ్యే బిగ్గెస్ట్ సినిమాల్లో టాలీవుడ్ హస్తం ఉండక మానదు. ఎలా అంటే కేజీఎఫ్ ఛాప్టర్ 2తో రికార్డులు బద్దలు కొడుతున్న ప్రశాంత్ నీల్ తర్వాతి సినిమాలు ప్రభాస్ తో సలార్, ఆ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో ఉన్నాయి. ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ సినిమాగా మారిన పుష్ప పార్ట్ 2 కూడా మరెన్నో రికార్డులను తిరగరాస్తుందనడంలో సందేహం లేదు. అంతేకాకుండా ఇండియాలోని బెస్ట్ డైరెక్టర్లలో ఒకడైన శంకర్ రామ్ చరణ్‌తో సినిమా చేస్తున్నాడు. బాలీవుడ్ బడా డైరెక్టర్ ఓంరావత్ నిర్మిస్తున్న ఆదిపురుష్ లో హీరోగా ప్రభాస్ అనే విషయం అందరికీ తెలిసిందే.
లిస్ట్ ఇంకా అయిపోలేదు.. ఇండియాలోనే బిగ్గెస్ట్ బడ్జెట్ సినిమాగా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్- Kకి డైరెక్టర్ నాగ్ అశ్విన్.. హీరో ప్రభాస్ అనే ఇప్పటికే అందరికీ తెలుసు. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఇంకా ఎన్నో అద్భుతాలు, బాక్సాఫీస్ కా బాప్ చిత్రాలు టాలీవుడ్ లో వచ్చాయి, వస్తాయి, వస్తూనే ఉంటాయి అని చెప్పేందుకు ఏ మాత్రం అనుమానించాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ సినిమాలను రీజనల్ సినిమాలు అనే పరిస్థితి నుంచి ఒక్కసారైనా టాలీవుడ్ డైరెక్టర్ తో సినిమా చేయాలి, ఒక టాలీవుడ్ హీరో మనకి ఛాన్స్ ఇస్తే బాగుండు అని ఎదురుచూసే పరిస్థితికి చేరుకుంది మన తెలుగు సినిమా. టాలీవుడ్ సినిమా సాధిస్తున్న ఈ విజయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.