బాక్సాఫీస్ మాన్‌స్టర్ రాఖీ భాయ్ రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబడుతున్నాడు. మూడో రోజు కూడా కేజీఎఫ్ 2 హవాలో ఏ మాత్రం మార్పులేదు. బాలీవుడ్ ప్రేక్షకులు ప్రశాంత్ నీల్– యశ్ కి నీరాజనాలు పడుతున్నారు. స్ట్రైట్ హిందీ సినిమాలకు సాధ్యంకాని స్థాయిలో కేజీఎఫ్ వసూళ్లు రాబడుతోంది. వెరసి ప్రపంచవ్యాప్తంగా 400 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించడానకి కేజీఎఫ్ 2కు కేవలం మూడ్రోజులు మాత్రమే పట్టింది. రెండు రోజుల్లో రూ.304.62 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. ఒక్క బాలీవుడ్ లోనే మూడ్రోజుల్లో 138 కోట్లు కలెక్ట్ చేసింది. ఇంక వరల్డ్ వైడ్ గా కూడా మూడో రోజు అదే హవా కొనసాగింది.
ఇదీ చదవండి: ప్రశాంత్ నీల్ కు ఫోన్ చేసిన మహేశ్ బాబు- Jr.ఎన్టీఆర్!
మొదటి రెండ్రోజుల కలెక్షన్స్ తో పోలిస్తే పెద్దగా మార్పు రాలేదనే చెప్పాలి. కొన్నిచోట్ల అయితే డే2 కన్నా ఎక్కువ వసూలు చేసినట్లు చెబుతున్నారు. మొత్తం మూడ్రోజుల్లో 410 కోట్లకు పైగానే గ్రాస్ ను రాబట్టింది. ఇంక రాఖీ భాయ్ స్పీడ్ చూస్తే 500 కోట్ల క్లబ్ లో చేరేందుకు పెద్దగా సమయం పట్టదనే చెప్పాలి. ఈ సినిమాకి రిపీట్ ఆడియన్స్ కూడా బాగా ఉన్నారనే చెప్పాలి. ఆ లెక్కలు చూసుకున్నా కూడా కేజీఎఫ్ ఛాప్టర్ 2 కలెక్షన్స్ ఇప్పుడల్లా తగ్గుముఖం పట్టవనే చెప్పాలి. అసలు మొత్తం మూడ్రోజుల్లో ఎంత గ్రాస్ కలెక్ట్ చేసిందో చూద్దాం.
డే 1- 165.37 కోట్లు
డే 2 – 139.25 కోట్లు
డే 3- 117 కోట్లు
#KGFChapter2 CROSSES ₹400 cr mark in just 3 days.
All set to STORM past ₹500 cr today.#Yash #KGF2
— Manobala Vijayabalan (@ManobalaV) April 17, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.