ఒక్క టాలీవుడ్ అనే కాదు.. ప్రతి ఇండస్ట్రీలో కామన్ గా ఉండేవి ఫ్యన్ వార్స్. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ గొడవలు పడుతుంటారు. ఇది ఇండస్ట్రీలో ఇప్పుడు మొదలైంది కాదులెండి.. జమానా నుంచి అలా కొనసాగుతూనే ఉంది. కాకపోతే ఈ ఫ్యాన్ వార్స్ లో ట్రెండ్ మారింది అనే చెప్పాలి. ఇంతక ముందు థియేటర్ల దగ్గర చొక్కాలు చింపుకునేవారు.. ఇప్పుడేమో ఆన్ లైన్ లో నోర్లు పారేసుకుంటున్నారు. మా హీరోకి అన్ని రికార్డులున్నాయి, మీ హీరోకి ఏమున్నాయంటూ పోస్టుల్లో ట్రోలింగ్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్– మహేశ్ ఫ్యాన్స్ మధ్య మొదలైన ఈ ఫ్యాన్ వార్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ఇదీ చదవండి: సర్కారు వారి పాట ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. సినిమా ఎలా ఉందంటే..!
మే 12న మహేశ్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మహేశ్ సరసన కీర్తీ సురేశ్ నటించగా.. పరశురామ్ దర్శకత్వం, తమన్ మ్యూజిక్ అందించాడు. ఈ సినిమా బుకింగ్స్ ఓపెన్ అయినప్పటి నుంచి ట్విట్టర్ లో ఫ్యాన్ వార్ మొదలైపోయింది. మహేశ్ ఫ్యాన్స్ అంతా మా సినిమా ఆ రికార్డు బ్రేక్ చేస్తుంది, ఈ రికార్డు బ్రేక్ చేస్తుంది అంటూ కామెంట్ చేస్తుండగా.. వాటికి పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ రెస్పాండ్ అయ్యారు. అక్కడ షురూ అయిన ఈ ఫ్యాన్ వార్ కొనసాగుతూనే ఉంది. మా సినిమా రిలీజ్ అయిన వారంలోగా బ్రేక్ ఈవెన్ సాధిస్తుందంటూ ట్వీట్లు చేస్తున్నారు. మరోవైపు గతేడాది విడుదలైన పవన్ కల్యాణ్ వకీల్ సాబ్, భీమ్లానాయక్ చిత్రాలు ప్రేక్షకులను మెప్పించినా బాక్సాఫీస్ వద్ద మాత్రం సరైన వసూళ్లు రాబట్టలేకపోయాయి. ఆ చిత్రాలను ఉద్దేశించే కామెంట్ చేస్తున్నారంటూ పవన్ ఫ్యాన్స్ సర్కారు వారి పాట సినిమాని ట్రోల్ చేస్తున్నారు.
Expectations Reality#GoGreenWithSVP pic.twitter.com/niVm5o0j3R
— . (@Chaitu3001___) May 11, 2022
X Roads…#GoGreenWithSVP pic.twitter.com/MCwDFr4PEc
— NikhiLᵐˢᵈⁱᵃⁿ🦁 (@BunnyNikhil214) May 11, 2022
Haritha Haram implementation in Karnataka by our very own Prince Maheshbabu#GoGreenWithSVP https://t.co/ly3abj6E6p pic.twitter.com/7bXrDksQbO
— . (@Chaitu3001___) May 11, 2022
అయితే వకీల్ సాబ్, భీమ్లా నాయక్ చిత్రాలకు ప్రభుత్వం నుంచి ఆంక్షలు, థియేటర్ ఆక్యుపెన్సీ తక్కువ ఉండటం, ఏపీలో టికెట్ ధరలు తక్కువ చేయడం వంటివి కారణాలుగా పవన్ అభిమానులు చెబుతున్నారు. అలాంటివి చెప్పుకోవాల్సిందే.. మా హీరో కెరీర్‌లో 100 కోట్లు దాటి ప్రీరిలీజ్ బిజినెస్ జరిగిన ఐదు సినిమాలు ఉంటే మీ హీరోకి కేవలం రెండే ఉన్నాయి అంటూ మహేశ్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. మరోవైపు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ సర్కారు వారి పాట సినిమా టికెట్ బుకింగ్స్ అన్నీ గ్రీన్ ఉన్నాయని ఓపెనింగ్స్ లేవంటూ గో గ్రీన్ అని ట్రోల్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా సందర్భాల్లో టాలీవుడ్ హీరోలే కాదు.. అన్ని ఇండస్ట్రీల హీరోలు మేమంతా బాగానే ఉంటాం.. మీరెందుకు కొట్టుకుంటారు అని చురకలు అంటించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ, ఫ్యాన్స్ తీరులో మాత్రం మార్పు రావడం లేదు. ఇలాంటి ఫ్యాన్స్ వల్లే హీరోలకు చెడ్డ పేరు వస్తోందంటూ న్యూట్రల్ ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇండస్ట్రీలో జరిగే ఫ్యాన్ వార్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Mind Blowing #GoGreenWithSVP pic.twitter.com/gMuXmiIPhY
— మొగలిరేకులు మున్న (@okeokadu_) May 9, 2022
#SarkaruVaariPaata Raichur Karnataka Bookings 😭#GoGreenWithSVP pic.twitter.com/WzCbTsab46
— USTAD❼ (@AlwaysRayuduu) May 11, 2022
💚 my favourite song 💚 #GoGreenWithSVP pic.twitter.com/5o5tTVTMeF#GoGreenWithSVP
— . (@Janasenanidhf) May 9, 2022
Non – RRR record 🔥#SarkaruVaariPaata #SVP #SVPmania pic.twitter.com/PiSMPzblAo
— HNE 2.0™ (@UrsHNE) May 10, 2022
He is coming Box Office Mogudu history repeat Avudhi 💥🔥🤙🥳 #SarkaruVaariPaata #SVP @urstrulyMahesh pic.twitter.com/GskdfLAGbi
— Pavan kumar dhfm cult (@PavankumarRayu5) May 11, 2022
Another celebrations #kerala drums
Urvashi theater 💥💥💥💥#SVPMania #svp#sarkaruvaariPaata #svponmay12kcpd pic.twitter.com/dFJT7D5GFQ— Kancharapalem Mahesh Fans™ #SVPOnMay12 🔔 (@kancharapalem) May 10, 2022
Festival Begins with 40Ft Cutout in Anjan Theatre, Bangalore..Mass Celebrations..Time to witness the Mental Mass Swag of our Beloved Superstar Mahesh Anna.. #SarkaruVaariPaata #SVP #SVPManiaBegins pic.twitter.com/jtccT3hceu
— Prince (@bhanu2023) May 11, 2022
Tmrw 🥵🥁
Repee anna darshanam 🤩🔥🔥#sarkaruvaariPaata #svpmania#svp pic.twitter.com/0tpbAULimt— ALLURI VAARI BETA ˢᵛᵖᵒⁿᵐᵃʸ¹² 🔔 (@the_mb_jayanth) May 11, 2022