RRR… ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ. ఈ సినిమా టికెట్ల కోసమే వెతుకులాట. దేశం మొత్తాన్ని ఈ సినిమా థియేటర్లకు పరిగెత్తేలా చేస్తోంది. ఇప్పటికే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. సోషల్ మీడియా మొత్తం రాజమౌళి, రామ్ చరణ్, తారక్ పేర్లే వైరల్ అవుతున్నాయి. థియేటర్ల దగ్గర పండగ వాతావరణం కనిపిస్తోంది. సెలబ్రిటీలు, సినిమా ప్రముఖులు సైతం ఈ సినిమాపై స్పందిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా సినిమాపై ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి: టాలీవుడ్ పాన్ ఇండియా సినిమాల క్రేజ్ చూసి కుళ్లుకుంటున్న బాలీవుడ్
ఈ సినిమా మెగాస్టార్ ప్రశంసల వర్షం కురిపించారు. ‘RRR సినిమా మాస్టర్ స్టోరీ టెల్లర్ నుంచి వచ్చిన మాస్టర్ పీస్. సినిమాపై రాజమౌళికి ఉన్న దూరదృష్టికి RRR సినిమా నిలువెత్తు సాక్ష్యం. సినిమా బృందానికి శుభాకాంక్షలు’ అంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. చిరంజీవి ట్వీట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#RRR is the Master Storyteller’s Master Piece !!
A Glowing & Mind blowing testimony to @ssrajamouli ’s Unparalleled Cinematic vision!
Hats off to the Entire Team!! 👏👏@RRRmovie@tarak9999 @AlwaysRamCharan @ajaydevgn @aliaa08 @OliviaMorris891 @DVVMovies
— Chiranjeevi Konidela (@KChiruTweets) March 25, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.