కేజీఎఫ్ ఛాప్టర్-2 సినిమా ప్రపంచ వ్యాప్తంగా క్రియేట్ చేసిన రికార్డులు చూశాం. ప్రశాంత్ నీల్ డైరెక్షన్, యశ్ మాస్ యాక్షన్ కు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. దేశవ్యాప్తంగా ఉన్న సినిమా అభిమానులు రాకీ భాయ్ కి నీరాజనాలు పట్టారు. ముఖ్యంగా బాలీవుడ్ ప్రేక్షకులు అయితే రాకీ భాయ్, ప్రశాంత్ నీల్ తో ప్రేమలో పడిపోయారు. స్ట్రైట్ బాలీవుడ్ సినిమాలు సైతం సాధించలేని స్థాయిని కేజీఎఫ్ అందుకుంది. రికార్డుల మీద రికార్డులు తిరగరాసింది. వరల్డ్ వైడ్ హైఎస్ట్ గ్రాస్ కలెక్టెడ్ మూవీస్ లిస్ట్ లో కేజీఎఫ్ ఛాప్టర్ 2 సినిమా మూడో స్థానంలో నిలిచింది. కేజీఎఫ్- 2 సినిమాని థియేటర్లలో ఏ రేంజ్ లో రిపీట్ మోడ్ లో చూశారో అందరికీ తెలిసిందే. ఆ సినిమా ఓటీటీకి ఎప్పుడు వస్తుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు.
అయితే ఆ ఎదురుచూపులకు తెర పడిందనే చెప్పాలి. ఎందుకంటే కేజీఎఫ్ ఛాప్టర్ 2 సినిమా ఓటీటీ రిలీజ్ జరిగిపోయింది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఛాప్టర్ 2 సినిమాని విడుదల చేసింది. తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం, హిందీ అన్ని భాషలను హెచ్‌డీ క్వాలిటీలో విడుదల చేసింది. కాకపోతే ఇక్కడ మాత్రం ఓ తిరకాసు పెట్టేసింది. సినిమా చూడాలంటే రెంట్ కట్టాల్సిందే అనమాట. సినిమా చూసేందుకు 199 రూపాయల రెంట్ కట్టాలి. తాజాగా RRR సినిమా కూడా ఇదే ప్రకటన చేసింది. మే20న ఓటీటీ రిలీజ్ చేస్తున్నాం అని చెప్పిన జీ5.. సినిమా చూసేందుకు అద్దె చెల్లించాలని ప్రకటన చేసింది. ఇప్పుడు కేజీఎఫ్ ఛాప్టర్ సినిమాని కూడా అమెజాన్ ప్రైమ్ అదే తరహాలో విడుదల చేసింది. అయితే మొదట మే27న ఓటీటీ రిలీజ్ అని టాక్ రాగా.. ఎలాంటి సమాచారం లేకుండా అమెజాన్ కేజీఎఫ్ ఛాప్టర్ 2 సినిమా విడుదల చేయడం గమనార్హం. పే పర్ వ్యూ పద్ధతిలో సినిమాలను ఓటీటీలో విడుదల చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.