బుల్లితెరపై అనేక కామెడీ షోలు ప్రసారం అవుతూ ఉంటాయి. కానీ ఈటీవీలో ప్రసారం అయ్యే జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీ లాంటి షోలు మాత్రం ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్నాయి. ఇక ఏదైనా పండుగలు వస్తే చాలు పలు కామెడీ ఈవెట్లతో ముందుంటుంది ఈటీవీ. తాజాగా ఈటీవీ 27 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా "భలే మంచి రోజు" అనే ఈవెంట్ ను నిర్వహించారు. యాంకర్ గా ప్రదీప్ తనదైన మాటలతో కవ్వించాడు. దీనికి సీరియల్ నటులతో పాటు జబర్దస్త నటులు కూడా వచ్చారు. ఈ క్రమంలోనే ఆది ఓ అమ్మాయిపై మనసు పారేసుకున్నాడు. మరిన్ని వివరాల్లోకి వెళితే.. హైపర్ ఆది.. ఈవెంట్ ఏదైనా.. వేదిక ఎక్కడైనా.. తనదైన పంచులతో కడుపుబ్బా నవ్విస్తాడు. అతడేసే పంచుకు తిరుగుండదు.. అటు నుంచి కౌంటర్ కూడా ఉండదు. అలా ఉంటాయి మనోడి పంచులు. ఈటీవీ 27 వసంతాల సందర్భంగా భలే మంచి రోజు చాప్టర్ 2 అనే కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ ఈవెంట్ లో శతమానం భవతి, మరో సీరియల్ నటీ నటులు కూడా పాల్గొన్నారు. ఇక ఆటో రాంప్రసాద్ అమ్మాయి ఫొన్ నంబర్ అడగ్గా.. ఆది అన్నా నీ దగ్గర ఉన్న నెంబర్ నే నువ్వు అడిగావన్నా.. అంటూ పంచేశాడు. ఇక ఇక్కడ ఒక్క అమ్మాయే లేదు అంటే మీకు ఇద్దరా అంటూ వారితో ఆది ఆడుకున్నాడు. ఈ నేపథ్యంలోనే శతమానం భవతి సీరియల్ నటితో ఆది పులిహోర కలిపాడు. ఆ నటికి జోడీ ఎవరూ లేరనగానే వెంటనే లేచి వెళ్లి నేనున్నాను అంటూ సాంగ్ వేసుకున్నాడు. అదీ కాక ఏంటండి ఇంత అందమైన జంటకి లవ్ సింబల్ వేయరా? అంటూ అడిగి మరీ లవ్ సింబల్ వేయించుకున్నాడు. ఆ అమ్మడుతో కొన్ని స్టెప్పులు సైతం వేసి తన మోకాలిపై కూర్చో పెట్టుకున్నాడు. ఆమె అప్పటికే చిరునవ్వులు చిందిస్తూనే డ్యాన్స్ చేసింది. ఇక వారు రెండు టీంలుగా సీరియల్, కమెడీయన్లు గా మారి పోటీని నిర్వహించారు. తర్వాత ఇమాన్యుయేల్ అన్నా ఎవర్నన్న చూసుకోనా? అని ఆదిని అడిగితే.. శతమానం భవతిని తప్ప ఎవర్నైనా చూసుకోరా అని అంటాడు.. దీంతో అక్కడ అంతా నవ్వులు పూశాయి. మళ్లీ ఇమాన్యుయేల్ అన్నా చమటలు పట్టించ మంటావా? అంటే అరేయ్ శతమానం భవతిని మాత్రం నాకు విడిచిపెట్టురా! అని అన్నాడు. ఈ ఈవెంట్ కు జబర్దస్త్ వదిలేసి వెళ్లిన చంద్ర తన టీం మెట్ శ్రీ సత్యతో కలిసి ఓ స్కిట్ చేశాడు. సీరియల్ నటీ, నటులు.. జబర్దస్త్ కమెడీయన్లు అందరు కలిసి 27 వసంతాల పండుగను అంగరంగ వైభవంగ జరుపుకున్నారు. దీంతో ఇప్పుడు మెుత్తానికి ఆదికి జోడి దొరికిందని అభిమానులు ఆనంద పడుతున్నారు. మరి ఆది శతమానం భవతి నటితో డాన్స్ వేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి: సామాన్యుడితో కలిసి నవ్వులు పూయించిన బాలయ్య.. వీడియో వైరల్! ఇదీ చదవండి: ఆ సమయంలో నా తలరాత అలా ఉంది: సాయిధరమ్ తేజ్