దేశవ్యాప్తంగా కేజీఎఫ్ ఛాప్టర్ 2 ఫీవర్ కొనసాగుతూనే ఉంది. బాక్సాఫీస్ వద్ద రాకీ భాయ్ కలెక్షన్ల సునామీ సాగుతూనే ఉంది. సినిమా ఇండస్ట్రీలో కేజీఎఫ్ సినిమాకి వచ్చిన హైప్, క్రేజ్ అంతా ఇంతా కాదు. మూడే మూడు సినిమాలతో ప్రశాంత్ నీల్ దేశంలోనే టాప్ డైరెక్టర్స్ సరసన చేరాడు. అయితే ఇప్పటి నుంచే కేజీఎఫ్ ఛాప్టర్ 3 సినిమా కోసం అభిమానులు ఎదురుచూడటం మొదలు పెట్టారు. కొందరు మాత్రం ఛాప్టర్ 3 ఉండదని చెబుతున్నా.. సినిమా వర్గాల్లో ఛాప్టర్ 3 ఉంటుందని గట్టి టాక్ వినిపిస్తోంది. అంతేకాదు కథ ఎలా ఉండబోతోందనే హింట్స్ కూడా చక్కర్లు కొడుతున్నాయి. కొన్ని ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ ఆధారంగా ఛాప్టర్ 3 స్టోరీ ఎలా ఉండే అవకాశం ఉందో చూద్దాం.
ఇదీ చదవండి: KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ బ్యాగ్రౌండ్! ఎవరీ ప్రశాంత్ నీల్?
పడుకోవడానికి మూడడుగుల చోటు కోసం దెబ్బల తిన్న స్టేజ్ నుంచి.. మొత్తం ప్రపంచం దృష్టిని ఆకర్షించిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా ఎదిగాడు రాకీ. అతని లక్ష్యం ఎప్పుడూ ఒక గొప్ప సుల్తాన్ గా ఎదగాలి అనే ఉండేది. ఆ లక్ష్యం కోసం చంపాడానికి.. చావడానికి ఎక్కడా వెనుకాడేవాడు కాదు. ముంబైని హస్తగతం చేసుకోవాలని ఎంతో పోరాడాడు. కానీ, ఆండ్రూస్ వచ్చి పిల్లాడికి చాక్లెట్ ఇస్తాను అన్నంత ఈజీగా ముంబైని రాసిస్తానంటాడు. అక్కడే రాకీ భాయ్ లో అనుమానం మొదలైంది. తనకు తెలియని ఒక గొప్ప మాఫియా ప్రపంచమే ఉందని తెలుసుకున్నాడు. ముంబై కాదు తాను హస్తగతం చేసుకోవాల్సింది నరాచీ అని తెలుసుకున్నాడు. అనుకున్నట్లుగానే నరాచీలో తన జెండా పాతాడు.రాకీ కథ అయిపోయింది అనుకున్న ప్రతిసారి అతను వేరే మార్గం కనుగొన్నాడు. బంగారం తీసుకుని పారిపోతున్నాడు అనుకున్న సమయంలో ఇనాయత్ ఖలీల్ ను కలిసి కొత్త వెపన్స్ తీసుకుని తిరిగొచ్చి కేజీఎఫ్ ను స్వాధీనం చేసుకున్నాడు. ప్రధాని ఎప్పటికైనా తనపై లీగల్ యాక్షన్ తీసుకుంటుందని తెలిసి ముందే ఆమె ప్రభుత్వంలో ఉన్న 200 మంది ఎంపీలను కొనేశాడు. రవీనా టాండన్ చెప్పినట్లు క్రిమినల్స్ ఎప్పుడూ ఒక అడుగు ముందే ఆలోచిస్త్తారు. కానీ, రాకీ భాయ్ మాత్రం పది అడుగులు ముందే ఆలోచిస్తుంటాడు. ఎలా అంటే గరుడను చంపితే.. కుర్చీ కోసం అతని తమ్ముడు వస్తాడని గ్రహించి.. గరుడ కంటే ముందు తమ్ముడిని చంపేశాడు. ఎంత క్రిటికల్ సిచ్యువేషన్ వస్తే రాకీ అంత పకడ్బందీగా స్కెచ్ వేస్తాడు.
ఇదీ చదవండి: KGF-2 నటీనటుల రెమ్యూనరేషన్స్ లిస్ట్! యష్ కి ఎంతంటే?
ఇప్పుడు ఛాప్టర్ 3 కథలో కూడా అదే చూసే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితి వస్తుందని ముందే గ్రహించిన రాకీ.. రష్యా నుంచి న్యూక్లియర్ సబ్‌మెరైన్లు కొనుగోలు చేసుకున్నాడు. గరుడ బ్యాచ్ 25 ఏళ్లలో తవ్విన బంగారాన్ని రాకీ కేవలం రెండేళ్లలో తవ్వి తీశాడు. ఆ మొత్తం బంగారాన్ని షిప్ లో ఎక్కించుకుని సముద్రంలోకి వెళ్లాడు. అక్కడ తన ఓడ నుంచి అటు ఇండియన్ నేవీ, ఇటు సీఐఏ వాళ్లకు సమాచారం ఇచ్చాడు. అతను ముందే ఒక స్పాట్ ఫిక్స్ చేసుకుని కావాలనే నేవీ వాళ్లు అతనిపై దాడి చేసేలా చేసి.. అతను చనిపోయాడనే భ్రమ కలిగించాడు. ముందే వేసుకున్న ప్లాన్ ప్రకారం సబ్ మెరైన్ లో తప్పించుకోవడమే కాకుండా.. మొత్తం బంగారాన్ని కూడా తీసుకెళ్తాడు.ఛాప్టర్ 2లో రాకీ కేజీఎఫ్ ని హస్తగతం చేసుకున్న తర్వాత రవీనా టాండన్ ప్రధాని అయ్యే మధ్య కాలంలో మూడేళ్లపాటు ఏం జరిగింది అనేది చూపించలేదు. ఆ మూడేళ్లలో రాకీ ఏం చేశాడు? సబ్ మెరైన్ లో తప్పించుకున్న తర్వాత ఏం చేస్తాడు? అనేదే ఛాప్టర్ 3లో చూసే అవకాశం ఉంటుంది. ఆ మూడేళ్లలో తన వ్యాపారాన్ని ప్రపంచ దేశాలకు వ్యాపింపజేయడమే కాకుండా.. ప్రపంచ దేశాల్లో తన సామ్రాజ్యాన్ని విస్తరించి ఉంటాడు. రాకీ ఎలా అయితే తన లక్ష్యాన్ని ముంబై నుంచి నరాచీకి మార్చుకున్నాడో.. ఆ తర్వాత అక్కడి నుంచి ప్రపంచంపైనే కన్నేశాడు. ‘నీ టెరిటరీ.. నా టెరిటరీ కాదు.. ది వరల్డ్ ఈజ్ మై టెరిటరీ’ అని రాకీ భాయ్ పార్ట్ 2లో చెప్పకనే చెప్పాడు. ఛాప్టర్ 3లో రాకీ భాయ్ ప్రపంచాన్ని ఏలే సుల్తాన్ గా ఎదగబోతున్నాడా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: KGF కి ఎండ్ లేదా? ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.