అక్కినేని నాగచైతన్య.. ప్రధానపాత్రలో నటించిన థాంక్యూ సినిమా జులై 22న విడుదలైన విషయం తెలిసిందే. నా జీవితంలో సాధించిన అన్ని సక్సెస్‌లకు కారణం నేనే అనుకునే వ్యక్తిగా నాగచైత్యన నటన ఆకట్టుకుంటుంది. చివరికి అసలు విషయం తెలుసుకుని తన విజయానికి కారణం అయిన ప్రతి ఒక్కరికీ థాంక్యూ చెప్పేందుకు ఒక టూర్ వేస్తాడు. చైతూ ఫ్యాన్స్ థియటర్ల దగ్గర సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు మహేశ్ ఫ్యాన్స్ కూడా నాగచైతన్యకు అభిమానులుగా మారిపోయారు. థాంక్యూ సినిమాలోని ఓ బ్యానర్ ఇమేజ్ ను తెగ వైరల్ చేస్తున్నారు. విషయం ఏంటంటే.. థాంక్యూ సినిమాలో నాగచైతన్య మూడు వేరియేషన్లు ఉన్న పాత్రలో నటించాడు. థాంక్యూ మూవీలో మహేశ్ బాబు అభిమానిగా నాగచైతన్య ఇరగదీశాడు. అంతేకాకుండా సినిమాలో ఒక్కడు సినిమాకి చైతూ బ్యానర్ కట్టడాన్ని చూపించారు. ఒక్కడు సినిమా విడుదల సందర్భంగా.. రాజకుమారుడిగా ఇండస్ట్రీకి వచ్చి, యువరాజుగా ఎదిగి, మురారిగా అందరి మనసులు దోచి, ఇప్పుడు ఒక్కడిగా వస్తన్న మన ప్రిన్స్ మహేశ్ బాబు.. అంటూ నారాయణపురం మహేశ్ ఫ్యాన్స్ అసోసియేషన్ అంటూ నాగచైతన్య ఫొటోతో బ్యానర్ ఉంటుంది. ఇప్పుడు మహేశ్ బాబు ఫ్యాన్స్ అంతా ఆ పిక్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తెగ ఆనందపడిపోతున్నారు. ఈ వైరల్ పిక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. Mahesh Babu reference in #Thankyou movie ...naga Chaitanya is going to appear as a super fan for super star Mahesh Babu..#Maheshbabu #Nagachaitanya #RashiKhanna #SarkaruVaariPaata pic.twitter.com/E1hUnXoa6s — thevarshith (@thevarshith13) June 18, 2021 ఇదీ చదవండి: ప్రముఖ ఓటిటి సంస్థలకు ‘థ్యాంక్యూ’ మూవీ హక్కులు .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? ఇదీ చదవండి: హీరో శ్రీ విష్ణుకు తీవ్ర అస్వస్థత! ఆస్పత్రికి తరలింపు! ఇదీ చదవండి: లైవ్ లో హీరోని ముద్దు అడిగిన హీరోయిన్.. వీడియో వైరల్!