ఐపీఎల్‌లో నైపుణ్యమున్న ఆటగాళ్లకు కొదవలేదు. కొత్త టాలెండ్ ఐపీఎల్ వల్ల బయటబడుతోందని మరోసారి రుజువైంది. ఆదివారం కోలకతాపై జరిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌లో ఈ సీజన్‌లో అత్యధిక వేగంగా బాల్ విసిరిన భారత ఆటగాడిగా ఉమ్రాన్ మాలిక్ రికార్డు నెలకొల్పాడు. 150.06 కిలోమీటర్ల వేగంతో బంతిని సంధించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. క్రికెట్ పండితులను ఆకర్షించాడు. అతడి బౌలింగ్ చూసి భారత మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా ఆశ్చర్యపోయాడు. అతని బౌలింగ్ యాక్షన్ బాగుందని ప్రశంసించాడు. ఇప్పటివరకు అతడిని వినియోగించుకోక పోవడంపై సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌పై ఆశిష్ నెహ్రా అసంతృప్తి వ్యక్తం చేశాడు.
సరైన బౌలింగ్ లైనప్ లేక సతమతమవుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. జమ్ముకశ్మీర్‌కు చెందిన ఉమ్రాన్ మాలిక్‌కు ఇప్పటివరకు అవకాశం కల్పించకపోవడంపై సర్వత్రా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఆశిష్ నెహ్రా కూడా అదే అంశంపై స్పందించాడు. ‘సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ ముందుగానే ఉమ్రాన్ మాలిక్‌ను ఆడించకపోవడం నన్ను ఆశ్యర్యానికి గురి చేసింది. నటరాజన్‌కు ప్రత్యామ్నాయంగా ఉమ్రాన్‌ను టీమ్‌లోకి తీసుకున్నప్పుడు ఎందుకు ఆడించలేదని ప్రశ్నించాడు. సరైన పేసర్‌లేక ఇబ్బంది పడుతున్న హైదరాబాద్ టీమ్ ముందుగానే ఉమ్రాన్‌ని ఉపయోగించుకోవాల్సింది’ అని ఆశిష్ నెహ్రా అభిప్రాయపడ్డాడు. ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ యాక్షన్ కూడా చాలా బాగుందని ప్రశంసించాడు ఆశిష్ నెహ్రా.
Umran malik spitting fire on debut 🔥 pic.twitter.com/j5jTWogxWA
— Moukthik (@MoukthikS) October 4, 2021
ఇదీ చదవండి: ఎవరీ ప్రీతమ్ జుకల్కర్.. సమంతతో అతనికి ఎలా పరిచయం ఏర్పడింది?