ఎవరీ ప్రీతమ్‌ జుకల్కర్‌.. సమంతతో అతనికి ఎలా పరిచయం ఏర్పడింది?

samantha preetham

టాలీవుడ్‌ క్యూట్‌ కపుల్‌ ‘నాగచైతన్య- సమంత’ విడాకులు తీసుకుంటున్నామంటూ అందరినీ షాక్‌కు గురిచేసిన విషయం తెలిసిందే. తమ దారులు వేరవుతున్నాయంటూ సోషల్‌ మీడియాలో సందేశాలు పెట్టి.. తమకు మద్దుతివ్వాలని కోరారు. వీరి విడాకుల అంశంపై ఇప్పటివరకు టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌ వరకు చాలా మంది సెలబ్రిటీలు స్పందించారు. అసలు కారణం చెప్పకపోయినా.. ఎప్పటి నుంచే వస్తున్న పుకార్లను నిజయం చేస్తూ ప్రకటన చేసేశారు. వీటన్నింటిలో వారి విడాకులకు ఇతడే కారణమంటూ ఓ పేరు బాగా వినిపిస్తోంది. అతడే ఫ్యాషన్‌ డిజైనర్‌ ప్రీతమ్‌ జుకల్కర్‌. అసలు అతను ఎవరు? సమంతకు ఎలా పరిచయం? అనే ప్రశ్నలు బాగా వినిపిస్తున్నాయి.

ఎవరీ ప్రీతమ్‌ జుకల్కర్‌?

ప్రీతమ్‌ జుకల్కర్‌(33) అనగానే ఏ నార్త్‌ ఇండియనో అనుకోకండి. అతను పక్కా హైదరాబాదీ కుర్రాడు. భారతీయ వస్త్ర సంప్రదాయాన్ని బతికించడమే లక్ష్యంగా జుకల్కర్‌ ఫ్యాషన్‌ డిజైనింగ్‌లో అడుగుపెట్టాడు. అందుకోసం ఫ్యాషన్‌ అండ్‌ టెక్స్‌టైల్స్‌లో డిగ్రీ కూడా పూర్తి చేశాడు. మంచి డిమాండ్‌ ఉన్న ఫ్యాషన్‌ డిజైనర్‌గా ఎదిగాడు. ప్రీతమ్‌ అసలు ఈ ఫ్యాషన్‌ ఫీల్డ్‌లోకి రావడానికి అసలు కారణం అతని తల్లేనని చెప్తుంటాడు. జుకల్కర్‌ చిన్నపటినుంచే అతని తల్లి బట్టల మిషన్‌పై కుట్టడం నేర్చుకున్నాడు. ఆమె పనిచేస్తున్నప్పుడు బాగా గమనిస్తూ ఉండేవాడు. అక్కడి నుంచే అతనికి ఫ్యాషన్‌ డిజైనింగ్‌పై ఇష్టం ఏర్పడింది. ఆ తర్వాత ఫ్యాషన్‌ డిజైనింగ్‌ అంటే ఏంటి అని వెతుకులాట ప్రారంభించి.. ఇప్పుడు ఈ స్థాయికి ఎదిగాడు.

సమంత ఎలా పరిచయం?

సమంతకు చేనేత వస్త్రాలు అన్నా.. ఆ ఉత్పత్తులు అన్నా చాలా ఇంష్టం. ఆ ఇష్టంతోనే తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఓ కార్యక్రమానికి తన మద్దతు తెలిపింది. వీలున్నంత వరకు చేనేత వస్త్రాలను ప్రమోట్‌ చేస్తూ ఉంటుంది. ప్రీతమ్‌ జుకల్కర్‌ కూడా భారతీయ వస్త్ర సంప్రదాయాన్ని కాపాడాలనే లక్ష్యంతో చేనేత వస్త్రాల డిజైనింగ్‌ను ప్రారంభించాడు. ఆ చేనేత వస్త్రాల డిజైనింగ్, ఇష్టమే సమంత, ప్రతీమ్‌ జుకల్కర్‌ మధ్య పరిచయానికి కారణం. ప్రీతమ్‌ జుకల్కర్‌ కేవలం సమంతకు మాత్రమే కాదు.. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, రాశీఖన్నాకు కూడా డిజైన్‌ చేస్తుంటాడు.

samantha preethamదుమారం అప్పటి నుంచే మొదలు

దాదాపు ఎనిమిది నెలల క్రితం ప్రీతమ్‌ జుకల్కర్‌ పుట్టినరోజు సందర్భంగా సమంత తన ఇన్‌స్టాలో ఓ పోస్ట్‌ పెట్టింది. సోఫాలో ప్రీతమ్‌ జుకల్కర్‌ ఒడిలో కాళ్లు పెట్టుకుని సమంత పడుకుని ఉంది. ఆ ఫొటోనే అలా ఉందనుకుంటే దానికి క్యాప్షన్‌ నాలుగేళ్ల బంధం అంటూ రాసుకొచ్చింది. సమంత చేసిన ఆ పోస్టుకు స్పందించిన ప్రీతమ్‌ జుకల్కర్‌ ‘ఐ లవ్‌ యూ’ అంటూ రిప్లై ఇచ్చాడు. అసలు రచ్చ అప్పుడే మొదలైంది. అప్పుడు ప్రీతమ్‌ జుకల్కర్‌పై నెటిజన్లు, అక్కినేని అభిమానులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. కొందరికి తీవ్రంగా స్పందిస్తూ సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేశాడు. కానీ, ట్రోలింగ్‌ ఆగకపోవడంతో మెసేజింగ్‌ను డిసేబుల్‌ చేశాడు. తాజా పరిస్థితికి అప్పటి సంఘటనలను ముడిపెడుతూ పలువురు సోషల్‌ మీడియా వేదికగా ప్రచారాలు ప్రారంభించడంతో మరోసారి ప్రీతమ్‌ జుకల్కర్‌ పేరు తెరపైకి వచ్చింది.

ఇది కూడా చదవండి: నటరాజ్‌ మాస్టర్‌ ఎలిమినేషన్‌ అందరూ ఊహించిందేనా? అసలు కారణాలు ఇవే!