షణ్ముఖ్‌ మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న కాజల్‌..

kajal anne master

బిగ్‌ బాస్‌ 5 తెలుగు’లో గ్రూపులు మాత్రం పోవట్లేదు. నామినేషన్స్ విషయంలోనూ ఆ ధోరణి బాగా కనిపిస్తోంది. మొదటి నుంచి గమనిస్తే ఎవరు ఎవరు కలిసి ఆడుతున్నారనే ఒక ఐడియా అందరికీ వస్తుంది. ఆ నామినేషన్స్ సమయంలో జరిగే గొడవలు ఆ వారం మొత్తం కొనసాగుతాయి. ఆ తర్వాత మళ్లీ ఆ గొడవలను చూపించి నామినేట్‌ చేసుంకుటారు. అదే చాలా వారాలుగా జరుగుతోంది. అయితే వీటన్నింటి మధ్యలో ఒక ఇద్దరి మధ్య మాత్రం సఖ్యత కుదరట్లేదు. వాళ్లు మొదటి నుంచి కొట్టుకుంటూనే ఉన్నారు. ఒక్కసారి కూడా కలిసి నవ్వూతు కనిపించింది లేదు. ఎప్పుడూ కొట్టుకోవడం, విమర్శించుకోవడంతోనే సరిపోయింది. ఇప్పిటికే అర్థమైపోయుంటుంది. ఆ జంటే యానీ మాస్టర్‌- కాజల్‌. వారి మధ్య దూరం ఇంకా పెరిగింది. అందుకు మరో సంఘటన ఉదాహరణ.

ఇదీ చదవండి: నామినేషన్స్‌ తో మానస్‌- యానీ మాస్టర్‌ మధ్య మొదలైన మనస్పర్థలు..

షణ్ముఖ్‌ మాటలకు కాజల్‌ ఏడుపులు..

నామినేషన్స్‌లో ‘కాజల్‌ నువ్వు వెళ్లిపోతే ఇంట్లో గొడవలు తగ్గుతాయని అనుకుంటున్నా.. అందుకే నేను నామినేట్‌ చేస్తున్నా’ అన్న షణ్ముఖ్‌ మాటలకు కాజల్‌ బోరున ఏడ్చింది. నేను నిజంగా అలా చేస్తున్నానా? నా వల్ల గొడవలు అవుతున్నాయా? అంటూ కాజల్‌.. సన్నీతో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకుంది. మరోవైపు సిరి కూడా కాజల్‌ అంటే నాకు అఫెక్షన్‌ లేదు.. ఇష్టంలేదు నాతో మాట్లాడకు అనే మాటలను గుర్తుచేసుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. ఆమెను సన్నీ చాలా కష్టపడి ఓదార్చాడు.

యానీ ఫైర్‌… అన్నీ డ్రామాలే..

కిచెన్‌లో నుంచి కాజల్‌ ఏడుపులు చూసిన యానీ మాస్టర్‌ వెంటనే బెడ్‌ రూమ్‌లోకి వెళ్లిపోయింది. అక్కడ శ్రీరామ్‌ ఉండగా అతనితో కాజల్‌పై నిప్పులు చెరిగింది యానీ. ‘కాజల్‌ ఇంక ఎప్పుడూ గేమేనా? అన్నీ దొంగ ఏడుపులు. ఎక్కడ కెమెరా ఉంటుంది.. ఎక్కడ ఉంటే కనిపిస్తాం.. ఎప్పుడు అదే గోలనా? ఎవరికి వద్దు బిగ్‌ బాస్‌ మాకు కూడా బిగ్‌ బాస్‌ ఇంపార్టెంటే కదా? లాంగ్వేజ్‌ అంటే నేను డిక్షనరీ పెట్టుకుని తిరగాలా? నాకు అంతే వచ్చు’ అంటూ యానీ మాస్టర్‌ ఫుల్‌ ఫైర్‌ అయ్యింది. కాజల్‌ దగ్గరికి పోను.. నాకు అవసరం లేదు. నన్ను హర్ట్‌ చేసింది. ఆమె అంటూ చెప్పుకొచ్చింది. అంటే కాజల్‌- యానీ మాస్టర్‌ కలిసేది జరిగేలా లేదు. మరోవైపు ఈ వారం అయితే కాజల్‌, లేదంటే యానీ మాస్టర్‌ ఎలిమినేట్‌ అవుతారు అంటూ ప్రచారాలు జరుగుతున్నాయి. అదే నిజం అయితే వాళ్లు హౌస్‌ లో ఎప్పటికీ శత్రువులుగానే ఉన్నట్లు. వీరి అనుబంధంపై మీ అభిప్రాయాలను కామెంట్‌ చేయండి.