నామినేషన్స్ తో మానస్- యానీ మాస్టర్ మధ్య మొదలైన మనస్పర్థలు..

anee master maanas

బిగ్‌ బాస్‌ 5 తెలుగు’లో గ్రూపు రాజకీయాలు, గ్రూపు గేమ్‌ లు బాగా పెరిగిపోయాయి. ప్రొవోకింగ్‌, విమర్శలు సర్వ సాధారణం అయిపోయింది. నామినేషన్స్‌ రోజు నుంచి మానస్‌- యానీ మాస్టర్‌ల మధ్య కొత్త రచ్చ మొదలైంది. ఒక హగ్గు వారి మధ్య చిచ్చు పెట్టింది. నేను ఎంతో రెస్పెక్ట్‌ ఇస్తానంటూ మానస్‌.. అందరిలో హగ్గు గురించి తీస్తే జనాలకు ఏం అర్థమవుతుందంటూ యానీ మాస్టర్‌ ఇద్దరూ వాదిస్తున్నారు. వారి వారి మిత్రుల వద్ద ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ బాగా ఫీల్ అవుతున్నారు. రవి మాత్రం వారి ఉద్దేశాలను వీరికి వీరి ఉద్దేశాలను వారికి చేరవేస్తూ ఉన్నాడు.

 

View this post on Instagram

 

A post shared by Anee Master (@aneemaster)

హగ్గు తెచ్చిన తిప్పలు..

హౌస్‌ లో నేను నీ ఒక్కడికే హగ్‌ ఇస్తాను. ఎందుకు అంటే ఐ మిస్‌ మై ఫ్యామిలీ.. నీ దగ్గర నాకు ఆ స్పేస్‌ ఉంది.’ అనేది యానీ మాస్టర్‌ వర్షన్‌. ఒక వారం మానస్‌ మాట్లాడుతూ మీరు నాకే కాదు.. శ్రీరామ్‌ ను కూడా హగ్‌ చేసుకున్నారు కదా? అనే ప్రశ్నను రైజ్‌ చేశాడు. దాంతో యానీ మాస్టర్‌ చాలా ఫీల్‌ అయ్యారు. నామినేషన్స్‌లో హగ్‌ మ్యాటర్‌ ఏంటి? అలా ఎలా తీస్తావు? జనాలు ఏం అనుకుంటారు? అంటూ యానీ మాస్టర్‌ ఫైర్‌ అయ్యింది. ఈ వాదన జరగడానికి కారణం నామినేషన్స్‌లో మానస్‌ ను నామినేట్‌ చేస్తూ నేను హగ్‌ ఇవ్వడానికి వస్తే నువ్వు తిరిగి వెళ్లిపోయావు అనడంతో మానస్‌ హర్ట్‌ అయ్యాడు. అలా అలా ఆ హగ్గు మ్యాటర్‌ చినికి చినికి గాలివాన అయ్యింది.

రవి మధ్యవర్తిత్వం..

మానస్‌తో రవి మాట్లాడుతు అలా ఎందుకు తీశావు అని ప్రశ్నించాడు. అందుకు మానస్‌ ‘ముందు మాస్టరే తీశారు. నేను ఐ కాంటాక్ట్‌ కూడా ఇవ్వలేదు అన్నారు. హగ్గు విషయం మాస్టరే ముందు మొదలు పెట్టారు.. నేను కాదు. నేను మాస్టర్‌ కు అట్‌ మోస్ట్‌ రెస్పెక్ట్‌ ఇస్తాను’ అంటూ  తనని తాను సమర్థించుకున్నాడు మానస్‌. మరోవైపు యానీ మాస్టర్‌తోనూ రవి మాట్లాడాడు. ‘మానస్‌ అలా మాట్లాడటం కరెక్ట్‌ కాదు. హగ్గ్‌ అని ఎలా అంటాడు మళ్లీ శ్రీరామ్‌ని చేసుకున్నారుగా అంటే వినడానికి ఎలా ఉంటుంది?’ అంటూ యానీ మాస్టర్‌ అసహనం వ్యక్తం చేశారు. వారి మధ్య మిస్‌ అండర్‌స్టాండింగ్‌ అనేది కచ్చితంగా కనిపిస్తోంది. వారిద్దరూ కలిసి కూర్చుని మాట్లాడుకుంటేనే దానికి ఒక ముగింపు పడుతుంది. వారి మధ్య ఉన్న మనస్పర్థలపై మీ అభిప్రాయాలను కామెంట్‌ చేయండి.