సాంకేతికంగా దేశం అభివృద్ధి వైపు దూసుకెళ్తుంది. ఇదే సమయంలో దేశాభివృద్ధిలో ఆడవారు కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రతి రంగంలో తమ ప్రతిభను చాటుతూ ప్రత్యేక గుర్తింపు సంపాదిస్తున్నారు. అయితే ఇంతాల ఆడవారు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నా.. కొన్ని చోట్ల మాత్రం ఇంకా వారిపై వివక్షత కొనసాగుతుంది. అనేక చోట్ల ఆడపిల్లను చిన్న చూపుచూస్తున్నారు కొందరు తల్లిదండ్రులు. ఆడపిల్లను ఇంటికి భారంగా భావిస్తున్నారు. మరికొందరు అయితే మరీ దారుణంగా పురిటి లోనే చంపేస్తున్నారు. ఇలాంటి వారికి ఓ తల్లిదండ్రులు చేసిన పని కనువిప్పు కలిగిస్తోంది. కూతురిపై వారు చూపిన ఆకాశమంత ప్రేమ.. అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తమ బిడ్డ అడుగులు ఎప్పటీ తమ ఇంట్లో ఉండాలని భావించారు ఆ అమ్మనాన్నలు. తమ కూతురు పాదాలను పాలతో కడిగి..వాటిని ఆ దంపతులు తాగారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తండ్రీ కూతుళ్ల బంధం గురించి ఎంత చెప్పిన తక్కువే. ఎందుకంటే ఆడపిల్లలకు అమ్మ కంటే నాన్నతో చనువు ఎక్కువగా ఉంటుంది. ప్రతి అమ్మాయికి తండ్రే మొదటి స్నేహితుడు. కూతుళ్లు తండ్రి మనసుకు చాలా దగ్గర ఉంటారు. అందుకే పెంచి పెద్ద చేసిన ఇంటి మహాలక్ష్మి.. పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్తుంటే ఆ తండ్రి బాధ వర్ణాతీతం. కొందరు తండ్రులైతే చిన్నపిల్లాడిలా వెక్కి వెక్కి ఏడుస్తుంటారు. అలా.. తండ్రీ కూతుళ్లు ప్రేమ అంతులేనిది. తాజాగా ఓ తండ్రి కూతుళ్ల ప్రేమానురాగాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమ బిడ్డకు పెళ్లి చేసి అత్తగారింటికి పంపడానికి ముందే ఆమె పాదాలను తమ ఇంట్లో భద్రపరుచకోవాలని భావించారు. అందుకుగాను ఆమె పాద ముద్రలను ఓ తెల్లంటి వస్త్రంపై తీసుకుని గుర్తుగా ఉంచుకున్నారు. అయితే దీనికంటే ముందు ఆ తల్లిదండ్రులు తమ బిడ్డను ఓ కుర్చీలో కూర్చోబెట్టారు. ఆ తరువాత ఆమె పాదాలను ఓ పళ్లెంలో పెట్టి.. మొదట నీటితో కడిగారు. తరువాత మరొక ప్లేట్ తీసుకుని ఈ సారి పాలతో తమ బిడ్డ పాదాలను కడిగారు ఆ తల్లిదండ్రులు. అంతటితో ఆగక.. ఆ పాలను ఓ గిన్నెలోకి తీసుకున్నారు. మొదట ఆ అమ్మాయి తండ్రి ఆ పాలను తాగగా, తరువాత తల్లి తాగింది. తల్లిదండ్రులు తనపై చూపిస్తున్న ప్రేమకు యువతి వెక్కి వెక్కి ఏడ్చింది. చివరకు ఎర్ర నీటిలో తమ బిడ్డ పాదాలను పెట్టి..తెల్లని వస్త్రంపై ఆ ముద్రలు వేయించారు. తమ బిడ్డ పాదముద్రలు ఉన్న ఆ వస్త్రాన్ని భద్రపరుచుకున్నారు. ఈ వీడియోను సంజయ్ కుమార్ అనే ఐఏఎస్ అధికారి ట్విట్టర్లో షేర్ చేస్తూ.. ఎమోషనల్ మూమెంట్ అనే ట్యాగ్ ను జతపర్చారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఆడపిల్లలను చిన్నచూపు చూసే వారు.. ఈ తల్లిదండ్రులను చూసైనా తమ బుద్ధులు మార్చుకోవాలని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కూతురు అంటే అమ్మకానీ అమ్మ అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి.. వైరల్ అవుతున్న ఈ వీడియోపై మీరు ఓ లుక్కేసి.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. भावुक पल.. विदाई से पूर्व बेटी के पद-चिन्हों को घर में संजोकर रखते मां-बाप..������#HeartTouching VC : SM pic.twitter.com/kJdF8dj4e6 — Sanjay Kumar, Dy. Collector (@dc_sanjay_jas) August 22, 2022 ఇదీ చదవండి: భలే బామ్మ.. 80 ఏళ్ల వయస్సులో బైక్ పై 600 కి.మీ ప్రయాణం! ఇదీ చదవండి: MLA ఇంట చదివింపుల విందు.. రూ.10 కోట్లు వసూలు!