ఆత్మలు మనిషి శరీరంలో ప్రవేశిస్తాయని సినిమాల్లోనే చూస్తాం. నిజ జీవితంలో ఇలాంటివి జరుగుతాయంటే ఎవరూ నమ్మరు. కానీ ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఈ వ్యక్తి మాత్రం తన శరీరంలో ఆత్మ ప్రవేశిస్తుందని అంటున్నాడు. అది కూడా గేదె ఆత్మ అని అంటున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని మహరాజాగంజ్ జిల్లాలోని రుద్రపూర్ శివనాథ్ గ్రామానికి చెందిన బుధిరామ్ అనే వ్యక్తి.. నాగపంచమి రోజున తనలో గేదె ఆత్మ ప్రవేశిస్తుందని అంటున్నాడు. గత కొన్నేళ్ళుగా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. రోడ్‌వేస్‌లో ఉద్యోగిగా రిటైర్మెంట్ పొందిన బుధిరామ్ చేసే చిత్ర విచిత్ర విన్యాసాన్ని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా జనాలు భారీగా తరలి వెళ్తుంటారు. ఈ ఏడాది కూడా తనలో మహిషాసుర (గేదె) ఆత్మ ప్రవేశించిందని విన్యాసాలు చేయడంతో చుట్టుపక్కల నుంచి జనం తండోపతండాలుగా వచ్చి ప్రత్యేక పూజలు చేశారు. గేదె ఆత్మ ప్రవేశించిన బుధిరామ్ గేదెలానే దాణా, మేత తింటాడు. గ్రామంలోని మాత ఆలయంలో ప్రతిష్టించిన భైంసాసురుని విగ్రహం ముందు కూర్చుని గడ్డి, పశుగ్రాసం వంటి వాటిని గేదె తిన్నట్టే తింటూ అందరి దృష్టిని ఆకర్శిస్తున్నాడు. నాగపంచమి రోజున బుధిరామ్ జంతువుగా మారిపోతాడని స్థానికులు చెబుతున్నారు. అతన్ని దైవాంశ సంభూతుడిగా భావించి పూలతో స్వాగతం పలుకుతారు స్థానికులు. గత 40, 45 ఏళ్ళుగా గేదె ఆత్మ తనలోకి వస్తుందని బుధిరామ్ స్వయంగా చెప్తున్నాడు. ప్రతీ మూడేళ్లకొకసారి ఇలా జరుగుతుందని, మిగిలిన రోజుల్లో సాధారణ జీవితం గడుపుతుంటాడని అంటున్నారు. గేదెలా శబ్ధం చేస్తూ దాణా, పచ్చగడ్డీ మేస్తున్నాడు. అక్కడకి వచ్చే స్థానికులు ఆ వ్యక్తికి గడ్డి, అరటి పండ్లు తినిపిస్తున్నారు. అంతేకాదు ఆయన తాగిన తొట్టెలోని నీటిని పవిత్రంగా భావించి ముట్టుకుని నమస్కారాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి గేదెలా గడ్డి తింటున్న బుధిరామ్పై, అలానే అతని ఆశీర్వాదం కోసం ఎగబడుతున్న జనంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. #ViralVideo यूपी के महराजगंज जिले में नागपंचमी पर अजीबोगरीब मामला, ग्रामीण के सिर पर हुआ भैंसासुर सवार, खाने लगा घास-फूस, बड़ी संख्या में दर्शन को पहुंचे लोग, लिया सभी ने आशीर्वाद#UttarPradesh pic.twitter.com/7UUSxOUwja — mahansharma (@Mahansharma6) August 3, 2022 ఇది కూడా చదవండి: కడుపులోకి స్టీల్ గ్లాస్… సర్జరీ చేసి బయటకి తీసిన వైద్యులు! ఎలా వెళ్లిందంటే.. ఇది కూడా చదవండి: అమెజాన్ లో ఆరేళ్ల చిన్నారి ఆధార్ కార్డు.. విమర్శల వెల్లువ! ఏంటంటే..